సమావేశంలో మాట్లాడుతున్న రాములునాయక్
వైరా: వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే పయనిస్తామని పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. ఖమ్మంలోని రాములునాయక్ నివాసంలో వైరా నియోజకవర్గ నాయకులు పలువురు ఏన్కూరు మండల మాజీ అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాములునాయక్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోగా, ఓడిపోయిన అభ్యర్థికే నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి ఇవ్వడంతో ఆవేదనతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశానని తెలిపారు. దీనిపై నాయకులు తమ మద్దతు రాములునాయక్‌కే ఉంటుందని ప్రకటించడంతో పాటు ఆయన వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీలు వేల్పుల పావని, మాలోత్ శఽకుంతల, లావుడ్యా సోనీ, నాయకులు పెద్దబోయిన ఉమాశంకర్, ఎండీ.హనీఫ్, ఎస్‌కే.బీబా, మాలోత్ కిషోర్, లావుడ్యా కిషన్ భూక్యా సైదా, బానోత్ కుమార్, భూక్యా చందులాల్, బండారి కృష్ణ, నరేష్‌నాయక్, వీరన్న, చాందిని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment