ఇస్లామాబాద్: భారత దేశం చంద్రుడి మీద అడుతుపెడుతుంటే.. కరాచీలో తెరిచి ఉన్న ముగురు కాలువలో పడి చిన్నారులు మృతి చెందిన వార్తలను పాక్ చూస్తోందని ఆ దేశ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన నేషనల్ అసెంబ్లీ సమావేశంలో ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా ప్రసంగించారు.
‘‘కరాచీ పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక పక్క ప్రపం దేశాలు చంద్రుడిపైకి వెళ్తుంటే.. కరాచీ మాత్రం తెరిచిన ఉన్న మురుగు కాలువల్లో చిన్నారులు పడిపోయి మృతి చెందిన వార్తలతో నిలుస్తోంది. భారత్ చంద్రుడి అడుగుపెట్టిందన్న రెండు సెకండ్లకు కరాచీలో ఇటువంటి ఘటనకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక.. కరాచీ స్వచ్ఛమైన నీరు దొరకటం లేదు.
سید مصطفیٰ کمال نے ببانگ دہل کراچی کا مقدمہ پارلیمنٹ میں کھلے الفاظ میں پیش کیا۔ سنئے#Pakistan #Sindh #Karachi #MQMP #PTI #PPP #President #AsifAliZardari #Bilawal #MustafaKamal #Nation #NationalAssembly #Parliament pic.twitter.com/7B8wKPIYP7
— Syed Mustafa Kamal (@KamalMQM) May 15, 2024
మరోవైపు.. మొత్తం 2.6 కోట్ల మంది చిన్నారుల్లో 70 లక్షల మంది పిల్లలు అసలు పాఠశాలకు వెళ్లటం లేదు. కరాచీ పాకిస్తాన్‌కి ఆదాయం ఇచ్చే ఇంజన్ లాంటి నగరం. ఇక్కడ రెండు సముద్రపు పోర్టులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు మొత్తం పాకిస్తాన్‌కి కరాచీ గేట్‌వే వంటిది. అటువంటి కరాచీ నగరంలోనే స్వచ్ఛమైన నీరు లభించటం లేదు. నీటి కోసం ట్యాంకర్ మాఫియా నడుస్తోంది’’ అని సయ్యద్ విమర్శలు చేశారు. సయ్యద్ చేసిన వ్యాఖ్యలు ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి.
ఇక..పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్.. విస్తరించిన రుణ సౌకర్యంలో భాగంగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్(ఐఎంఎఫ్) వద్ద రుణం కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment