Sakshi News home page

‘వింటూ ఉంటే చెబుతూ ఉంటా’ గ్రంథావిష్కరణ

Published Tue, Nov 21 2023 4:42 AM

- - Sakshi

సుల్తాన్‌బజార్‌: నవ్య సాహితీ సమితి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయంలో ప్రముఖ కవి తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహిత డాక్టర్‌ మాదిరాజు బ్రహ్మానంద రావు రచించిన ‘వింటూఉంటే చెబుతూ ఉంటా’ అనే పద్య మౌక్తికాలు అనే గ్రంధావిష్కరణ సభ జరిగింది. ప్రముఖ కవి నవ్యసాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్‌ ఆచార్య ఫణింద్ర ఈ సభకు అధ్యక్ష వహించారు. సమితి కార్యదర్శి ఎం.లక్ష్మీమానస సభకు స్వాగతం పలికారు. ప్రముఖ సంస్కృతి ఆంధ్ర పండితులు డాక్టర్‌ సంఘనభట్ల నర్సయ్య, తెలుగు అకాడమి పూర్వ అధ్యక్షులు ఆచార్య యాదగిరి గౌరవ అతిథులుగా పాల్గొని గ్రంధాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘనభట్ల నర్సయ్య మాట్లాడుతూ..... వైవిధ్యమైన రచనలు చేయడం బ్రహ్మానందరావు ప్రత్యేకత అన్నారు. ఆధ్యాత్మికత, రాజకీయాలు, జాతీయ వ్యక్తిత్వం, వైజ్ఞానికం, సామాజిక, నీతి నియమాల వంటి వివిధ విషయాలపై ముక్తిక పద్యాలను రచించారన్నారు. డాక్టర్‌ బ్రహ్మానందరావు భాషా సేవల్లో విశిష్టులుగా నిలిచారని ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీ వేత్త దత్తాత్రేయశర్మ, రామ్మోహన్‌రావు, మురళీధర్‌గౌడ్‌, సమన్వయ కర్త వేమరాజు విజయ్‌కుమార్‌, ఎం.లక్ష్మీమానస తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement