మన అజ్ఞాత ఇంజినీర్లు | Sakshi
Sakshi News home page

మన అజ్ఞాత ఇంజినీర్లు

Published Wed, Dec 27 2023 5:20 AM

Sakshi Guest Column On Anonymous Engineers

భారతదేశ అభివృద్ధి చేతివృత్తుల మీద జరిగింది. గౌండ్ల, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వంటి నైపుణ్యాలున్న కులాలు దేశమంతటా ఎన్నో ఉన్నాయి. పౌర సమాజంలో వీరి జనాభానే అధికం. ఈ చేతివృత్తుల కులాలే అనేక రంగాల్లో అద్భుతమైన ఇంజినీరింగ్‌ పరిజ్ఞానాన్ని సృష్టించాయి. ఉత్పత్తి సంస్కృతికి వీరు ప్రతినిధులు. ఆర్యులు, ముస్లింలు, బ్రిటిష్‌ వలసవాదులు గనక భారతదేశం మీదకు దండెత్తి వచ్చి ఉండకపోతే, ఈ భారతీయ ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు ఒక ప్రత్యేక తాత్విక దృక్పథాన్ని సంతరించుకొని ఉండేవి. అయితే ఈ కులాలను ముస్లిం, బ్రిటిష్‌ దురా క్రమణదారుల కంటే బ్రాహ్మణ హిందూమతమే ఎక్కువగా దెబ్బతీసింది. వీరి నైపుణ్యాలకు ఆధ్యాత్మిక హోదా కల్పించలేదు. వీరిని సమాజంలో తక్కువ స్థాయిలోనే ఉంచింది. అయినా వాళ్లు సమాజ అభివృద్ధిలో నిరంతరం పాలుపంచుకుంటూనే వచ్చారు.

కల్లుగీత కార్మికులు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్నారు. వీళ్ళు మనుషులు తాగడానికీ, తద్వారా తమ ఆరోగ్యాన్ని సమ తూలంగా ఉంచుకోవడానికీ పనికొచ్చే పానీ యాన్ని అందించే చెట్లను కనుగొన్నారు. కనుగొన డమే కాదు, దానికి తగిన పనిముట్లను సిద్ధం చేశారు. ఇందులో వీరి గొప్ప ప్రతిభ దాగివుంది. అందుకే కల్లుగీత కోసం రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం మనిషికీ, ప్రకృతికీ మధ్య ఒక సజీవ మైన అనుబంధంగా మారింది. 

భారతదేశంలో అత్యంత గొప్ప ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు మరో మూడు కులాల్లో కనిపిస్తాయి. అవి కమ్మరి (ఇనుముతో పనిముట్లు తయారు చేసేవాళ్లు), వడ్రంగి (కలపతో వివిధ పనులు చేసేవాళ్ళు), కంసాలి (బంగారం, వెండితో ఆభర ణాలు చేసేవాళ్లు). కమ్మరి వృత్తి ఆర్యుల కాలం కంటే ముందు నుంచే ఉన్నట్టు కనపడుతుంది. వారి పనిముట్లు చరిత్రకు ఆనవాళ్లు పట్టిస్తాయి. ఈ వృత్తికి సంబంధించిన పరిజ్ఞానం ఇప్పటికీ మన గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో అంత ర్భాగం.

కమ్మరి పని వ్యవసాయ ప్రక్రియలో అనేక విధాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. భారత దేశపు సామాజిక శక్తులు ఇనుము ఉపయోగాలను ఎలా కనుక్కొని ఉంటాయన్నది ఒక చారిత్రక అంశం. కమ్మరి కొలిమి ఇనుము సంబంధ పనుల్లో కీలకం. ఆ ప్రదేశం రెండు పైపు లైన్లను తోలు తిత్తితో అనుసంధానించి ఉంటుంది. అది కొలిమిలోకి క్రమబద్ధంగా గాలిని సరఫరా చేస్తుంది. ఈ తిత్తి ఆవిష్కరణ ఒక అద్భుతం.

వడ్రంగి పనికి గొప్ప వృత్తి నైపుణ్యం అవసరం. వీరు సృష్టించిన అత్యంత విప్లవాత్మక సాధనం నాగలి. అలాగే వడ్రంగులు మానవ సమాజానికి అందించిన మరొక సేవ,ఇళ్ల నిర్మాణం. సమాజ ప్రధాన అవసరాలలో ఒకటైన ఇంటికి వాడే కర్రపనిలో వడ్రంగుల నైపుణ్యం మామూలుది కాదు. ఈనాటి ఇళ్ల నమూ నాల మూలాలన్నీ వడ్రంగుల నైపుణ్యంలో దాగి వున్నాయి.

ప్రపంచంలో తొలినాళ్ల కుండల తయారీ జ్ఞాన వ్యవస్థల్లో కొన్నింటికి భారతదేశం పుట్టినిల్లు అని చెప్పవచ్చు. సింధు నాగరికత నాటికి మన దేశంలో కుండల తయారీ ఎంతో ఉచ్చస్థితిలో ఉంది. కుండల తయారీని ఎలా అభివృద్ధి పరిచారు అన్నది ఒక ఆశ్చర్యం. భారతీయ గ్రామాల్లో కుండల తయారీలో అధునాతన పరిజ్ఞానం కలిగిన కులాలు ఉన్నాయి. వారిని తెలుగునాట కుమ్మరోళ్లని పిలుస్తారు. అసలు సింధు నాగరికత ఈ కుండలు తయారు చేసేవారి భుజస్కందాలపై ఆధారపడే ఏర్పడినట్టు అనిపిస్తుంది.

కుండల తయారీ పరి జ్ఞానం తొలుత మట్టికీ, చక్రానికీ మధ్య నుండే సంబంధాన్ని అర్థం చేసుకోవడంతో మొద లవుతుంది. ముడి కుండను మలిచేందుకు ముందు చక్రం తిప్పుతారు. మెత్తని బంక మట్టిని కుండగా మార్చవచ్చనీ, ఆ కుండలను వంటలకూ, నీళ్లు, ఇతర ద్రవ పదార్థాల నిల్వ ఉపయోగించవచ్చనీ వాళ్లకు ఎవరు చెప్పి ఉంటారు? మానవ జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు భూవనరు లతో నిరంతరం పోరాడేవాళ్ళే బంకమట్టి నుంచి రకరకాల కుండలు తయారు చేయ వచ్చని కను గొని ఉంటారు.

వేగంగా తిరిగే చక్రం మీద ఉంచిన బంకమట్టిని చేతివేళ్ల కొనలతో నొక్కుతూ ఒక ఆకారంలోకి తెస్తారు. ఈ దశలో కుమ్మరి చేతివేళ్ళు, గోళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవాళ గృహాల అంతర్గత అలంకరణకు వినియోగించేలా అనేక ఆకృతులను కూడా అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇలా దేశంలోని ఎన్నో కులాలు భారతదేశ ఉత్పత్తి సంస్కృతికి ప్రాతినిధ్యం వహించాయి. దేశ నాగరకతను ముందుండి నడిపించాయి.
– కిరణ్‌ ఫిషర్‌
అడ్వకేట్‌ ‘ 79893 81219 

Advertisement

తప్పక చదవండి

Advertisement