అర్థరాత్రుళ్లు.. ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా? దీనివల్లే కావొచ్చు | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి 1-4గంటల మధ్యలో నిద్ర లేస్తున్నారా? ఆత్మలు కల్లోకి..

Published Fri, Dec 22 2023 5:06 PM

Waking Up From Sleep At The Middile Of The Night U Should Know This - Sakshi

కొంతమందికి ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంది. మరికొందరికి ఎంత ప్రయత్నించినా ఓ పట్టాన నిద్రపట్టదు. మరికొందరు నిద్రలేమి సమస్యతో తెగ ఇబ్బంది పడతారు. ఇంకొందరు అర్థరాత్రుళ్లు 1-4 గంటల మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు మేలుకుంటారు. ఆ తర్వాత ఎంత నిద్రపోదాం అని ప్రయత్నించినా నిద్రపట్టదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

అందుకే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. రాత్రి పడుకున్నామంటే తెల్లారే వరకు లేవకూడదు. అలా అయితేనే మంచి నిద్ర పట్టినట్లు. నిద్రలో పదేపదే మెలకువ వస్తే వారు జాగ్రత్త పడాల్సిందే. అర్థరాత్రుళ్లు మనం లేచే సమయాన్ని బట్టి మనం ఏ విషయం గురించి ఆందోళన చెందుతున్నామో ఇట్టే తెలుసుకోవచ్చట. 

అర్థరాత్రి 1 గంటలకు..
అర్థరాత్రి ఒంటిగంట సమయంలో సాధారణంగా గాఢ నిద్రలో ఉంటారు. కానీ ఆ సమయంలో నిద్రలేస్తున్నారంటే.. మీరు మానసికంగా చాలా స్ట్రెస్‌లో ఉన్నట్లు అర్థం. 

2 గంటలకు..
ఈ సమయంలో నిద్రలేస్తున్నారంటే.. మీ శరీరం చాలా అలిసిపోతుందని, దానికి కాస్త రెస్ట్‌ అవసరమని గ్రహించాలి. దీనికోసం ఎక్సర్‌సైజ్‌, మంచి డైట్‌ వంటివి రెగ్యులర్‌ రొటీన్‌లో అలవాటు చేసుకోవాలి. 

3 గంటలకు..
తెల్లవారుజామున 3 గంటలకు మెలవకువ వస్తుందంటే కాస్త భయానకంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయాన్ని డెవిల్స్‌ అవర్‌ అని పిలుస్తారు. ఈ సమయంలో ఆత్మలు కలలోకి వస్తాయని కొందరి విశ్వాసం. అయితే మరికొందరు పరిశోధకులు మాత్రం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేవడం మంచిదని సూచిస్తున్నారు. ఇది ధ్యానం చేయడానికి సరైన సమయంగా చెబుతున్నారు. ఎంత త్వరగా పడుకుంటే అంత త్వరగా నిద్రలేవొచ్చు అని, కాబట్టి ఇది ఒక రకంగా మంచిదే అంటున్నారు.

రాత్రి 3.30 నిమిషాలు
ఈ సమయంలో నిద్ర లేస్తున్నారంటే మీరు మంచి అభివృద్ది పథంలో కొనసాగుతున్నట్లు అర్థమట. ఈ సమయంలో దేవతలు సంచరిస్తుంటారనే విశ్వాసం కూడా ఉంది.

తెల్లవారుజామున 4గంటలకు..
తెల్లవారుజామున 4 గంటలకు ఉలిక్కి పడి లేస్తున్నారంటే మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు అర్థం. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, చాలా నిరాశతో ఉన్నట్లు ఈ సమయం సూచిస్తుందట. 

 ఉదయం 4.30 గంటలకు..
ఈ సమయంలో మీరు మేల్కొనడం మంచిదే అని పరిశోధనల్లో వెల్లడైంది. చాలా పాజిటివ్‌ మైండ్‌తో జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలకు విశ్వం మీకు మార్గనిర్దేశం చేస్తుందని కొందరి నమ్మకం.

ఉదయం 5గంటలకు..
అకస్మాత్తుగా 5 గంటలకు తరచూ లేస్తున్నారంటే జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్యల వల్ల కావొచ్చట. సాయంత్రం వేళల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఇందుకు కారణం. అంతుకే నైట్‌ టైం లైట్‌ ఫుడ్‌ను తీసుకోవాలి. ఇలాంటి వాళ్లు రాత్రి 7 గంటలు లేదా అంతకంటే ముందే భోజనాన్ని తినేలా ప్లాన్‌ చేసుకుంటే మంచిది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement