Sakshi News home page

జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..!

Published Thu, Dec 21 2023 5:12 PM

Swiss Woman Searches For Her Biological Mother In Mumbai - Sakshi

కొన్ని గాథలు ఆశ్చర్యకరంగానూ, భావోద్వేగంగానూ ఉంటాయి. ఆ కథలు సుఖాంత అనుకునేలోపు కొనసాగింపు వెతుక్కుంటూ వస్తుంటే..కొత్త మలుపుతో రసవత్తరంగా ఉంటుది. కానీ సుఖాంతమైతే బావుండనని మాత్రం అనిపిస్తుంది. అలాంటి తపించే కథే స్విస్‌ మహిళ గాధ. ఆమె పుట్టింది భారత్‌లో, పెరిగింది స్విస్‌ దంపతులు వద్ద. తన కన్నవాళ్లు వాళ్లు కాదని తెలిసి ఉద్వేగానికి గురైంది. తను జన్మమూలలను వెతుక్కుంటూ భారత్‌కి వచ్చింది. తన తల్లి ఆచూకీ కోసం తపిస్తున్న ఉద్వేగభరితమైన కథ!.

విద్యా  ఫిలిప్పన్‌ ఫిబ్రవరి 8, 1996న భారత్‌లో జన్మించింది. ఐతే ఆమె తల్లి పుట్టిన వెంటనే మదర్‌ థెరిసా మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీలో వదిలేసింది. అక్కడ నుంచి ఆమెను 1997లో స్విస్‌ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత విద్యా ఫిలిప్పన్‌ స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయింది. అయితే తనను పెంచుతున్న తల్లిదండ్రులు తన వాళ్లు కాదని తెలిసి ఒక్కసారిగా ఉద్వేగం చెందింది. తనకు జన్మనిచ్చిన తల్లిది భారత్‌ అని తెలిసి వెంటనే తనను వదిలేసిన మదర్‌ థెరిస్సా మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీని సందర్శించింది. అక్కడ ఆమె తల్లిది ముంబైలోని దహిసర్‌ ప్రాంతామని తెలుసుకుంది.

కానీ విద్యా తల్లి అక్కడ ఇచ్చిన చిరునామా ఇప్పుడు ఉనికిలో లేదు. దీంతో ఆమెకు సామాజిక కార్యకర్త అడాప్టీ రైట్స్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ అడ్వకేట్‌ అంజలి పవార్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయంలో మిషనరీ స్వచ్ఛంద సంస్థ కూడా కొంతసాయం చేసింది. వేగంగా నగరాలుగా మారుతున్న తరుణంలో విద్యా తల్లి ఇచ్చిన చిరునామాని ట్రైస్‌ చేయడం సాధ్యం కాలేదు విద్యాకు. దీంతో సామాజిక కార్యకర్త విద్యా ఫిలిప్పన్‌ తల్లిని కనుగొనేలా సాయం చేయాలని దహిసర్‌ ప్రజలను కోరారు. ఆమె తల్లి ఇంటి పేరు కాంబ్లీ అని ఉంది. కాబట్టి ఆ ఇంటి పేరుతో ఉన్నవాళ్లు గురించి ఏమైన తెలిస్తే తమకు తెలియజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు విద్యా ఫిలిప్పన్‌ మాట్లాడుతూ..నా తల్లికి 20 సంవత్సరాలు వయసులో తనకు జన్మనిచ్చిందని, ఆమె కోసం తాను పదేళ్లుగా వెతుకుతున్నానని ఆవేదనగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను తన తల్లి ఆచూకీ కోసం తన భర్తతో కలిసి భారతదేశానికి వచ్చాను. నా కుటుంబం ఇంటిపేరు కాంబ్లీ అని ముంబైలోని వ్యక్తులు మా అమ్మ ఆచూకీని కనుగొంటే గనుక తనకు సమాచారం అందించాలని వేడుకున్నారు. ఏ కారణాల రీత్యా ఆ తల్లి పేగుబంధాన్ని వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందో గానీ కనీసం ఇప్పటికైనా ఆ విధి కరుణించి ఆ తల్లి కూతుళ్లను కలిపితే బావుండను కదూ. ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లి కోసం తపనపడుతున్న ఆ విద్యా ఫిలిప్పన్‌కు నిరాశ ఎదరవ్వకుండా ఆ తల్లి ఆయురారోగ్యాలతో జీవించి ఉంటే బావుండు. 

(చదవండి: కిడ్నీ దానం చేస్తే ఆ వ్యక్తి ఇదివరకటిలా బతకడం కుదరదా? ప్రమాదమా!)

Advertisement

తప్పక చదవండి

Advertisement