ఇంగువతో ఇన్ని లాభాలా? బరువును తగ్గించే మ్యాజిక్‌ డ్రింక్‌ | Sakshi
Sakshi News home page

ఇంగువతో ఇన్ని లాభాలా? బరువును తగ్గించే మ్యాజిక్‌ డ్రింక్‌

Published Mon, Mar 25 2024 5:41 PM

check Asafetida Benefits Side Effects Health Benefits - Sakshi

అసాఫెటిడా, హింగ్ లేదా ఇంగువగా  ప్రసిద్ధి చెందింది. రుచి , ఘాటైన వాసనతో ఉండే  భారతీయ  వంటకాల్లో వాడే  కీలకమైన సుగంధ ద్రవ్యం. పూర్వకాలం నుంచే భారతీయులు సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంగువను ప్రతిరోజు వంటకాలలో ఉపయోగిస్తే శరీరానికి మంచిదని  ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.  దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు  గురించి తెలుసుకుందాం.

సాంబారు, పప్పు, పులుసుకూరలు, పచ్చడి తాలింపులలో మాత్రమే వాడుతారు అనుకుంటే పొరపాటే.  మంచి వాసన, రుచితోపాటు, ఇంగువ అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. 


ఇంగువ ఆరోగ్య ప్రయోజనాలు 

బరువు తగ్గడానికిమ్యాజిక్‌ డ్రింక్‌: ఇంగువ నీరు తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇంగువలో ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంగువ నీరు మ్యాజిక్‌లా పనిచేస్తుందని చెబుతారు. 

జీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు వంటి కడుపు రుగ్మతల నివారణలో ఉపయోగపడుతుంది. కడుపు పూత,కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడేవారు ఇంగువ వాడి, దీన్ని అధిగమించవచ్చు. ఛాతీపై పూయడం వల్ల ఆస్తమా, కోరింత దగ్గు, ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
♦ యాంటీవైరల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది ఉబ్బసం, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది.
♦ ఇంగువ సహజ యాంటిడిప్రెసెంట్.ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారికి ఇంగువ మంచి మందు.

♦లైంగిక సమస్యలకు: నపుంసకత్వ సమస్యలలో బాధపడుతున్న పురుషులకు ఇది బాగా సహాయపడుతుంది. అకాల స్కలన సమస్యకు కూడా బాగా పనిచేస్తుందని అని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ,పురుషుల్లో లైంగిక వాంఛను గణనీయంగా పెంచుతుందట

కేన్సర్‌ ప్రమాదం: కేన్సర్‌ కణితి, పరిమాణాన్ని తగ్గించడంలో ఇంగువ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. కేన్సర్‌ వ్యాప్తిని అరికడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కేన్సర్‌ కణాలతో పోరాడుతాయి.

ఊపిరితిత్తులు, కాలేయం ,మూత్రపిండాలలో మెటాస్టాసిస్ నివారణలో పనిచేస్తుంది. మెదడులోని రక్త నాళాలలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయ పడుతుంది. తలనొప్పిని తగ్గిస్తుంది.

♦ యాంటీ ఏజింగ్: చర్మం ముడతలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు ముఖంపై ముడతలను కూడా తొలగిస్తుంది.  ఇందులోని టైరోసిన్  నిస్తేజమైన చర్మానికి మెరుపునిస్తుంది.

♦ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది కీళ్ల నొప్పి, వాపు తగ్గించే అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,రిలాక్సింగ్ లక్షణాలను కలిగి ఇంగులో ఉన్నాయి. 
♦ పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరితో బాధపడుతుంటే ఇంగువ దివ్యవౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు బహిష్టు సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు ఇతర సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
♦ పంటి నొప్పికి కూడా ఇంగువ మంచి ఫలితాలనిస్తుంది.ఇంగువలో నొప్పి నివారణ గుణాలు అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement