శ్రీ సత్యసాయి జిల్లా జౌకల గ్రామంలో ఘటన
గ్రామ తెదేపా నాయకులపై పోలీసులకు ఫిర్యాదు
కదిరి అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం జౌకల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగభూషణం (38) దారుణహత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే ఈ పని చేసి ఉంటారని హతుడి సోదరి చంద్రమ్మ కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నాగభూషణం అవివాహితుడు. శుక్రవారం కూడా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రచారం ముగిశాక రాత్రి తన ఇంటిముందు నిద్రించాడు. గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేసి అతి దారుణంగా చంపేశారు. ఘటనాస్థలాన్ని కదిరి పట్టణ సీఐ పుల్లయ్య పరిశీలించారు.
హతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన తమ్ముడు నాగభూషణాన్ని గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు జయచంద్రనాయుడు, గోవర్దన్‌నాయుడు, జయరాంనాయుడు, జయరాం చంపి ఉంటారని అతడి అక్క చంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్లంతా తనను గ్రామంలో ఉండనీయబోమని వీళ్లు బెదిరిస్తున్నట్లు హిందూపురంలో ఉన్న తనకు నాగభూషణం ఫోన్‌చేసి చెప్పినట్లు తెలిపారు.
తాను వచ్చి మాట్లాడతానని సముదాయించానని, అంతలోపే కిరాతంగా చంపే«శారని విలపించారు. చంద్రమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగభూషణం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద వైఎస్సార్ïÙపీ సీఈసీ సభ్యుడు, కదిరి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పూల శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నాగభూషణం హంతకుల్ని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట ఎంపీపీ అమరనాథ్‌రెడ్డి, జేఏసీ కన్వినర్ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment