ఆస్తి తగాదాలకు ఇద్దరు బలి | Sakshi
Sakshi News home page

ఆస్తి తగాదాలకు ఇద్దరు బలి

Published Sun, Jan 28 2024 9:09 AM

Two Died To Property Disputes - Sakshi

మైలార్‌దేవ్‌పల్లి: ఇంటి విక్రయమై తలెత్తిన తగాదాలు ఇద్దరు వ్యక్తులను బలి తీసుకున్నాయి. ఓ యువకుడు ఇనుప రాడ్డుతో దాడి చేసి తండ్రిని, మేనమామను చంపిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌కు చెందిన అల్లంపల్లి లక్ష్మీనారాయణ (55), అనిత దంపతులు. వీరికి కుమారులు మల్లేష్, రాకేష్‌ (24), కూతురు ఆమని ఉన్నారు. రాకేష్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 

కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు..
మల్లేష్‌ కర్ణాటక రాష్ట్రంలోని ఓ పుణ్య క్షేత్రానికి వెళ్లగా..  ఇంట్లో రాకేష్ తో పాటు తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి అనిత, సోదరి ఆమని ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు అప్పు తీర్చేందుకు లక్ష్మీనారాయణ ఇంటిని ఇదే బస్తీకి చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. అడ్వాన్స్‌గా రూ.50 వేలు తీసుకున్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన ఇంటి పేపర్లను రూ.15 లక్షలు అప్పు తెచ్చి విడిపించుకున్నారు. 

అప్పటినుంచి ఇంట్లో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలని అడ్వాన్స్‌ ఇచి్చన వ్యక్తి పట్టుబడుతున్నాడు. కానీ.. ఇంటి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో లక్ష్మీనారాయణ ఏపీలోని మంత్రాలయంలో ఉన్న తన బావమరిది శ్రీనివాసులు (60)æను పిలుపించుకున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి విక్రయ విషయంపై మాట్లాడుకుంటున్నారు. అప్పులు ఎలా తీర్చాలని తండ్రీ కొడుకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. తండ్రిని రాకేష్‌  కొట్టుకుంటూ బయటికి గెంటివేశాడు. 

దీంతో ఆయన ఇంటి మెట్లపై పడిపోయాడు. కిందపడిన లక్ష్మీనారాయణను లేపడానికి బావమరిది శ్రీనివాసులు వచ్చాడు. కోపోద్రిక్తుడైన రాకేష్‌ ఇంట్లోంచి ఇనుప రాడ్డు తీసుకువచ్చి తండ్రి, మేనమామలపై బలంగా కొట్టాడు. దీంతో వారిద్దరూ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయారు. నిందితుడు రాకేష్‌ అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న లక్ష్మీనారాయణ, శ్రీనివాసులును ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.  

Advertisement
Advertisement