Hyderabad Crime: Software Employee Kriti Sambyal Commits Suicide In Gachibowli, Details Inside - Sakshi
Sakshi News home page

సచిన్‌.. నాకు బతకాలని లేదు: గచ్చిబౌలిలో ఐటీ ఎంప్లాయ్‌ సూసైడ్‌!

Published Thu, Jun 2 2022 1:01 PM

Hyderabad Crime News: Gachibowli Kriti Sambyal Commits Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంచి కంపెనీలో మంచి ఉద్యోగం. అయినవాళ్లను విడిచిపెట్టి.. ఊరు కానీ ఊరులో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఏం కష్టం వచ్చిందో ఏమో.. ఉరి వేసుకుని ప్రాణం తీసుకుంది!. గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిణి కృతి సంభ్యాల్‌ సూసైడ్‌ స్థానికంగా విషాదం నింపింది. 

గచ్చిబౌలిలో ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది కృతి సంభ్యాల్‌. ఆమె స్వస్థలం జమ్ముకశ్మీర్. ఇద్దరిలో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో ఉంటోంది కృతి.  ఈ క్రమంలో రూమ్ మేట్స్ లేని టైం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తన స్నేహితుడు సచిన్ కుమార్‌కు ‘నాకు బతకాలని లేదు’ ఓ మెసేజ్‌ పంపింది. అది చూసి  అప్రమత్తమయ్యాడు సచిన్‌. 

సచిన్ హుటాహుటిన ప్లాట్‌కు వచ్చాడు. కానీ, అప్పటికే ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో కృతిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. కృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చేపట్టారు గచ్చిబౌలి పోలీసులు.

Advertisement
 
Advertisement
 
Advertisement