వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్‌ ముద్రించాలని నిర్ణయం | Sakshi
Sakshi News home page

వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్‌ ముద్రించాలని నిర్ణయం

Published Sat, May 4 2024 3:27 PM

Nepal announced printing of Rs 100 note featuring a map of Indian territories

నేపాల్ భారత భూభాగాలైన లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీలు కలిగి ఉన్న మ్యాప్‌తో కొత్త రూ.100 కరెన్సీ నోటును ముద్రించాలని నిర్ణయించింది. ఈ చర్యను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో వివాదాస్పద భూభాగాలను నేపాల్ కొత్త మ్యాప్‌లో చేర్చాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి రేఖా శర్మ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ భూభాగాలకు సంబంధించి ఇండియా-నేపాల్‌ మధ్య భిన్నాభిప్రాయలున్నాయి.

వివాదాస్పద భూభాగాలతో కూడిన మ్యాప్‌ను నేపాలీ రూ.100 నోట్‌పై ముద్రించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్‌ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్‌ టెక్నాలజీ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఏప్రిల్ 25, మే 2వ తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొత్త మ్యాప్‌ రీడిజైన్‌కు ఆమోదం లభించినట్లు ఆమె చెప్పారు.

ఇదీ చదవండి: ‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..’ నిర్మలాసీతారామన్‌ వివరణ

అసలు వివాదం ఏమిటి..?

లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు నవంబర్ 2019లో భారత్‌మ్యాప్‌లో చేర్చారు. అవి ఇండియా తమ భూభాగాలుగా భావిస్తోంది. మే 2020లో నేపాల్ అదే భూభాగాలతో రాజకీయ మ్యాప్‌ను విడుదల చేసింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. మే 8, 2020న లిపులేఖ్ మీదుగా కైలాష్ మానస సరోవరాన్ని కలిపేలా రహదారిని ప్రారంభించాలని భారత్‌ ప్రయత్నించింది. దాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ భారత్‌కు నోట్‌ను పంపించింది. దాంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా గుండా వెళ్లే రహదారి పూర్తిగా భారత భూభాగంలోనే ఉందని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement