ఈ ఏడాదే చిప్‌ ప్లాంటు నిర్మాణం షురూ | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదే చిప్‌ ప్లాంటు నిర్మాణం షురూ

Published Fri, Mar 1 2024 4:28 AM

Government approves 3 semiconductor units in India - Sakshi

టాటా ఎల్రక్టానిక్స్‌ వెల్లడి

న్యూఢిల్లీ: పీఎస్‌ఎంసీ భాగస్వామ్యంతో గుజరాత్‌లోని ధోలెరాలో తలపెట్టిన రూ. 91,000 కోట్ల సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ మెగా యూనిట్‌ నిర్మాణం ఈ ఏడాదే ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాటా ఎల్రక్టానిక్స్‌ తెలిపింది. దీనితో ఆ ప్రాంతంలో 20,000 పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరగగలదని పేర్కొంది.

సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ విభాగంలో భారత్‌ ఎంట్రీకి సారథ్యం వహించగలగడం తమకెంతో గర్వకారణమని టాటా ఎల్రక్టానిక్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెమీకండక్టర్ల ప్లాంటులో పవర్‌ మేనేజ్‌మెంట్‌ ఐసీలు, డిస్‌ప్లే డ్రైవర్లు, మైక్రోకంట్రోలర్లు మొదలైన వాటికి అవసరమైన చిప్స్‌ తయారు చేయనున్నారు. నెలకు సుమారు 50,000 వేఫర్ల తయారీ సామర్ధ్యంతో ప్లాంటును ఏర్పాటు
చేయనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement