ఎగుమతులపై దృష్టి పెడుతున్న భారత్.. కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు | Sakshi
Sakshi News home page

ఎగుమతులపై దృష్టి పెడుతున్న భారత్.. కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు

Published Fri, Dec 1 2023 7:45 AM

Focus on Exports to African Countries - Sakshi

న్యూఢిల్లీ: నైజీరియా, ఇథియోపియా, ఘనా వంటి సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలు, ఇతరత్రా గల్ఫ్‌ దేశాలకు ఎగుమతులను పెంచుకోవడంపై భారత్‌ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా టారిఫ్‌యేతర అవరోధాలను తొలగించడంపై కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం గణనీయ స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలున్న సహారా ప్రాంత దేశాలు, గల్ఫ్‌ దేశాల్లోని భారతీయ మిషన్‌లతో వర్చువల్‌ సమావేశాలు నిర్వహింనట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆయా దేశాలతో ఆర్థిక, వ్యాపార సంబంధాలు, ఎగుమతుల స్థితిగతులు, టారిఫ్‌యేతర అడ్డంకులు మొదలైన వాటి గురిం చర్చింనట్లు వివరించారు. 

సహారా ప్రాంత దేశాలకు సంబంధిం దక్షిణాఫ్రికా .. భారత్‌కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2022–23లో దక్షిణాఫ్రికాతో మొత్తం 18.9 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం నమోదైంది. ఇందులో 8.5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా (11.85 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం, 5.15 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు), టోగో (6.6 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం, 6 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు), టాంజానియా (6.5 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం, 3.93 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు) ఉన్నాయి. మిగతా ఆఫ్రికన్‌ దేశాల్లో మొజాంబిక్, అంగోలా, కెన్యా ఉన్నాయి. 

గల్ఫ్‌లో సౌదీ అరేబియా (52.76 బిలియన్‌ డాలర్లు), ఖతర్‌ (18.77 బిలియన్‌ డాలర్లు) తదితర దేశాలతో అత్యధికంగా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఎగుమతులకు ఊతమిచ్చే క్రమంలో ప్రధానంగా ఆహారం, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్‌ వంటి రంగాలు, ప్రధాన మార్కెట్లపై దృష్టి పెట్టాలంటూ ఎగుమతిదార్లకు వాణిజ్య శాఖ సూంంది. అలాగే, అంతర్జాతీయంగా మరిన్ని ఎగ్జిబిషన్స్‌ వంటివి నిర్వహించవచ్చని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్‌–అక్టోబర్‌) ఎగుమతులు 7 శాతం తగ్గి సుమారు 245 బిలియన్‌ డాలర్లకు, దిగుమతులు దాదాపు 9 శాతం క్షీణించి 392 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

Advertisement
Advertisement