Horoscope Today in Telugu: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది | Sakshi
Sakshi News home page

Horoscope Today in Telugu: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

Published Fri, Dec 22 2023 5:24 AM

horoscope today 22 12 2023  rasiphalalu telugu  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.దశమి ఉ.9.38 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: అశ్వని రా.11.07 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: రా.7.18 నుండి 8.52 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.42 నుండి 9.26 వరకు తదుపరి ప.12.21 నుండి 1.05 వరకు, అమృతఘడియలు: సా.4.15 నుండి 5.46 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.30, సూర్యాస్తమయం: 5.27. 

మేషం... రుణబాధలు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం.... పనులు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో పురోగతి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అభివృద్ధి పథంలో  సాగుతాయి.

కర్కాటకం... ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో ప్రతిష్ఠంభన. దూరప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం.... శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కన్య.... వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల.... ఆస్తుల విక్రయాలు లాభిస్తాయి. నూతన మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం. ఆలయ దర్శనాలు.

వృశ్చికం.... సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు.

ధనుస్సు.... పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా కొనసాగుతాయి.

మకరం.... కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

కుంభం.... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మీనం.... చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి లాభం. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement