ఆసరా వేడుక.. పుట్టింటి కానుక | Sakshi
Sakshi News home page

ఆసరా వేడుక.. పుట్టింటి కానుక

Published Fri, Jan 26 2024 6:14 AM

Ysr asara scheme to people: Andhra Pradesh - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా ఆసరా సంబరాలు పండుగలా సాగుతున్నాయి. పుట్టింటి నుంచి వచ్చిన కానుకలా భావిస్తూ అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెక్కులు తీసుకునేటప్పుడు వారి మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

పండుగ వాతావరణవంలో ప్రజా­ప్రతినిధులు చెక్కుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇంత పెద్ద మనస్సుతో ఆర్థికంగా ఆదుకుంటారని తాము కలలో కూడా ఊహించుకోలేదని మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్‌ ఆసరా నిధులు తమ అకౌంట్‌లో జమ అవుతుంటే అక్కచెల్లెమ్మల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. – సాక్షి నెట్‌వర్క్‌

పండ్ల వ్యాపారం ఫలించింది
నేను డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా చా­లా కాలంగా ఉన్నా­ను. గతంలో రుణం తీసుకున్నప్పటికీ తి­రి­గి కట్టడానికి మా­త్రమే అ­వి సరిపోయేది.  సీఎం జగన్‌ దయ వల్ల ఆసరా ద్వారా నాలుగు విడతలుగా, విడతకు రూ.16,200 చొప్పున మొత్తం రూ.64,800 రుణమాఫీ అయ్యింది. వాటితో అప్పటి వరకు చిన్నగా చేస్తున్న పండ్ల వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాను. బ్యాంకు అధికారులు మరో రూ.2 లక్షల రుణం ఇచ్చారు. వ్యాపారం కోసం ఇప్పుడు వడ్డీలకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేకపోయింది.  – ముచ్చర్ల సత్యకుమారి, రేలంగి, ఇరగవరం మండలం, పశ్చిమగోదావరి జిల్లా

చీరల వ్యాపారం చేస్తున్నా..
వైఎస్సార్‌ ఆసరా ప­థ­కం ద్వారా మా గ్రూపున­కు రూ.5.68 లక్షలు రు­ణ­మాఫీ అయ్యింది. మాకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.14,200 చొప్పున నాలుగేళ్లకు 56,800 వచ్చింది. దీంతో నేను చీరల వ్యాపారం చేస్తున్నా. అప్పులు తెచ్చి వ్యాపారం చేద్దామంటే వడ్డీలకే సరిపోతుంది. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ పొ­దు­పు సంఘాల్లో ఉన్న మాకు రుణ మాఫీ చేసి నిలబెట్టారు. – ఉప్పర ఉమాదేవి, మద్దికెర, కర్నూలు జిల్లా

టైలరింగ్‌ ద్వారా ఇద్దరికి చేయూత
నేను టైలరింగ్‌ చేస్తాను. నా భర్త కార్పెంటర్‌. జగనన్న అందించిన ఆసరా ఒకటి రెండు విడతలు డబ్బులతో కుట్టు మిషన్‌ కొనుగోలు చేశాను. తర్వాత అందించిన డబ్బులతో ఒక ఎలక్ట్రికల్‌ మిషన్, ఒక జిగ్‌జాగ్‌ మిషన్‌ కొనుగోలు చేశాను. మరో ఇద్దరు మహిళలను సహాయకులుగా పెట్టుకుని వారికి కూడా చేయూతనిస్తున్నాను. పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలి.  – ఎన్‌.స్వాతి, సింగుపురం, సాయిరాం స్వయం శక్తి సంఘం, శ్రీకాకుళం

‘ఆసరా’ ఆదుకుంది
ఈమె పేరు ఏకుల వాణి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని  అనంతరాయయేని గిరిజన కాలనీలో ఉంటారు. ఈమెకు ఇద్దరు కుమారులు. భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందారు. సరస్వతి పొదుపు గ్రూపు సభ్యురాలిగా ఉన్న ఈమెకు గతంలో సక్రమంగా రుణాలు వచ్చేవి కావు. ఈమె గ్రూపునకు 2019లో రూ.3 లక్షల రుణం మంజూరైంది. వాటితో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నారు. నాలుగు విడతల్లో వైఎస్సార్‌ ఆసరా నగదును ఆమె ఖాతాలో జమ చేశారు. మొత్తం రూ.32 వేలు ఆమె ఖాతాలో జమైంది. దీంతో ఆమె నిర్వహిస్తున్న బడ్డీకొట్టును ఫ్యాన్సీ దుకాణంగా మార్చుకుని సంతోషంగా వ్యాపారం సాగిస్తోంది. 

‘సొంత అన్న’లా ఆదరిస్తున్నాడు 
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు అంతపు లీల. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం. సరస్వతి డ్వాక్రా గ్రూపు సభ్యురాలిగా ఉంది. ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకంలో భాగంగా డ్వాక్రా రుణ మాఫీ కింద ఈమెకు ఏడాదికి రూ.12,600 ప్రకారం నాలుగేళ్లకు రూ.50,400 నేరుగా బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యింది. అంతేకాకుండా పావలా వడ్డీతో రూ.లక్ష రుణం తీసుకున్న ఈమె కుటుంబ పోషణకు చేదోడుగా ఉంటోంది. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం జగన్‌ చేస్తున్న కృషి మరువలేమని, అన్నలా ఆదరిస్తున్న ఆయనకు అండగా ఉంటామని ఆనందంగా చెబుతోంది.

ఈ ప్రభుత్వ మేలు మరువలేం 
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు మాదాసు జమున. విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడు. ఈమె భర్త నాగబాబు లారీ క్లీనర్‌. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  తొలుత జమున ఓ దుకాణంలో పని చేసేది. ఈమె సభ్యురాలిగా ఉన్న ‘వెలుగు దీపం’ గ్రూపునకు ఆసరా ద్వారా రుణ మాఫీ వర్తించింది. వరుసగా మూడు విడతల్లో సుమారు 40వేలు లబ్ధి చేకూరింది. డ్వాక్రా గ్రూపు ద్వారా రూ.4 లక్షలు రుణ సహయం పొందింది. దీంతో టిఫిన్‌ బండి పెట్టుకుంది. చిరు వ్యాపారులకు సీఎం జగన్‌ అందించే రుణ సహయం కూడా తోడైంది. ఇప్పుడు ఆసరా ద్వారా వచ్చే రూ.12 వేలతో వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని చెబుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement