MP Avinash Reddy's Mother Lakshmamma Health Bulletin Released - Sakshi
Sakshi News home page

ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Published Thu, May 25 2023 2:28 PM

Mp Avinash Reddy Mother Lakshmamma Health Bulletin Released - Sakshi

సాక్షి, కర్నూలు: ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్‌ను విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమెకు సీసీయూలో చికిత్స కొనసాగుతుందన్నారు. అల్ట్రా స్కాన్‌లో పరీక్షలో పురోగతి కనిపించింది. లక్ష్మమ్మను సాధారణ రూమ్‌కు షిఫ్ట్‌ చేస్తామని వైద్యులు వెల్లడించారు. 

కాగా, పులి­వెందుల భాకరాపురంలోని తమ నివాసంలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ ఛాతీలో నొప్పి రావడంతో సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికంగా ఉన్న దినేశ్‌ నర్సింగ్‌ హోంలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించాలని వైద్యులు సూచించారు.

ఈ క్రమంలో ప్రత్యేక అంబులెన్స్‌లో బయలుదేరగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాక్‌ నిపుణుడు హితేశ్‌రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్‌ రవికళాధర్‌రెడ్డి పర్యవేక్షణలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
చదవండి: ఓవరాక్షన్‌ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు?

Advertisement
 
Advertisement
 
Advertisement