సీఎం జగన్‌కు జనం బ్రహ్మరథం.. ఓర్వేలేని చంద్రబాబు
రాళ్లు.. చేతికి ఏది దొరికితే దానితో సీఎం జగన్‌పై దాడి చేయాలంటూ శనివారం తాడికొండలో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన వైనం
విజయవాడ సింగ్‌నగర్‌లో డాబా కొట్ల సెంటర్‌లో అదే రోజు రాత్రి 8.10 గంటలకు సీఎం జగన్‌పై హత్యాయత్నం
చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ హత్యాయత్నానికి తెగబడ్డారంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు, రాజకీయ విశ్లేషకులు
స్కిల్ స్కామ్‌లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాMý... చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగని రీతిలో సీఎం జగన్‌ను దారుణంగా శిక్షిస్తానని రంకెలు
ఆది నుంచి కుట్రలు, కుతంత్రాలు, అరాచకత్వం..వెన్నుపోట్లు.. హత్యా రాజకీయాలే చంద్రబాబు సిద్ధాంతం
విద్యార్థి దశలోనే కుల రాజకీయాలతో ఎస్వీ యూనివర్సిటీని భ్రష్టు పట్టించారు..
అస్థిత్వం కోసం టీడీపీలో చేరి కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు.. తన దోపీడీ గుట్టును రట్టు చేస్తున్నారనే నెపంతో నాటి సీఎం ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావును మట్టుబెట్టించడంతో రక్తదాహం ప్రారంభం
టీడీపీపై పట్టు కోసం ఎన్టీఆర్‌పై మల్లెల బాబ్జీతో హత్యాయత్నం చేయించారని ఆరోపించిన మాజీ సీఎం నాదెండ్ల
వంగవీటి రంగాను అంత మొందించడంలో చంద్రబాబుదే కీలకపాత్ర అని స్పష్టం చేసిన చేగొండి హరిరామజోగయ్య
అధికారం కోసం పిల్లనిచి్చన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు.. వైశ్రాయ్ హోటల్ వద్ద చెప్పులతో దాడి
అవమాన భారం, మనస్థాపంతో మృతి చెందిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్ష కారకుడు చంద్రబాబేనని నాడూ, నేడూ చెబుతున్న రాజకీయ విశ్లేషకులు
1995 నుంచి 2004 మధ్య రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి, వేటాడి మట్టుబెట్టించడమే ధ్యేయం
రాజకీయ ప్రాబల్యం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన మహానేత వైఎస్ కుటుంబంపై కక్ష తీర్చుకునేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు
విశాఖ ఎయిర్‌పోర్టులో నాటి ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం చేయించిన వైనం
గత ఎన్నికలప్పుడు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపైనే తిరుపతిలో రాళ్లతో దాడి చేయించిన బాబు
ఇప్పుడు తన రాజకీయ జీవితానికి ముప్పు ఏర్పడటంతో అమిత్ షాతో కాళ్లబేరం
దుష్టచతుష్టయంతో కలిసి అనునిత్యం కుట్రలే
సీఎం జగన్‌పై హత్యాయత్నంతో చంద్రబాబు క్రూర స్వభావం మరోమారు బట్టబయలు
రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే..జనంతో మమేకమవుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకోవడం ఒక మార్గం. పూటకో కుట్ర, రోజుకో కుతంత్రం పన్నుతూ.. రాజకీయంగా నీడనిచ్చిన వారికి వెన్నుపోటు పొడుస్తూ.. ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి మట్టుబెడుతూ రక్తపుటేరులు పారించడం రెండో మార్గం.. శకునిలోని కుటిలత్వం.. దుర్యోధనుడిలోని క్రూరత్వం.. దుశ్శాసనుడిలోని కిరాతకం.. ధృతరాష్ట్రుడిలోని కపటత్వం కలగలిసి దుష్టచతుష్టయ లక్షణాలను పుణికిపుచ్చుకున్నరెండున్నర ఎకరాల రైతు కుటుంబానికి చెందిన నారా చంద్రబాబునాయుడు రెండో మార్గాన్నే ఎంచుకున్నారు.
విద్యార్థి దశలోనే ఏడుకొండలవాడి పాదాల చెంత ఎస్వీ యూనివర్సిటీని సం‘కుల’ సమరానికి వేదికగా మార్చారు.. కుల రాజకీయాలతో దాడులకు తెగబడ్డారు.విద్యార్థి నాయకుడి దశ నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాక.. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలతో రక్తపుటేరులకు కేరాఫ్‌గా మారారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అడుగడుగునా రక్తపు మరకలే!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పేదల పక్షాన నిలబడిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బస్సు యాత్రలో సంఘీభావం తెలిపేందుకు ఊరూరా వాడవాడన మేమంతా సిద్ధం అంటూ ప్రజలు తండోపతండాలుగా కదలివస్తూ నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజా క్షేత్రంలో ఒంటరిగా వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడానికి భయపడి జనసేన, బీజేపీతో జట్టుకట్టి.. మూడు పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేస్తుండటంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.
సీఎం జగన్‌కు వస్తున్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేక.. రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే భయంతో శనివారం తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో సాయంత్రం 5.20 గంటలకు ప్రసంగిస్తూ రాళ్లు, చేతికి ఏది దొరికితే దాంతో సీఎం జగన్‌పై దాడి చేయాలని చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతో కరుడుగట్టిన టీడీపీ మూకల ముఠా విజయవాడ సింగ్‌నగర్‌లో డాబా కొట్ల సెంటర్ వద్ద బస్సు యాత్రలో సీఎం జగన్ రోడ్‌షో నిర్వహిస్తారని ముందే గ్రహించి.. పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి తెగబడ్డారు.
ఈ హత్యాయత్నంపై చంద్రబాబు తనయుడు లోకే‹శ్, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరును చూస్తుంటే ఇందులో బాబు హస్తం ఉందని సీఎం జగన్ అభిమానులే కాదు పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతలు, సామాన్య ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ స్కాంలో అడ్డంగా సీఐడీ పోలీసులకు పట్టుబడి.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై బయటకొచి్చనప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి రీతిలో సీఎం జగన్‌ను దారుణంగా శిక్షిస్తానంటూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోవడాన్ని రాజకీయ పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్రలో జనం నీరాజనాలు పలుకుతుండటం చూసి ఓర్వలేక విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో కోడికత్తితో హత్యాయత్నానికి తెగబడేలా కుట్ర చేశారు. చంద్రబాబు వ్యవహార శైలి మొదటి నుంచి ఇలానే ఉందని పలు ఘటనలను ఉదహరిస్తున్నారు.
కుట్రలు, కుతంత్రాలే శ్వాసగా..
టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు తన సహజ లక్షణాలైన కుట్రలు, కుయుక్తులకు మరింత పదును పెట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో, టీడీపీలో.. నాదెండ్ల భాస్కర్‌రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. వారిని అడ్డుతొలగించుకోకపోతే తాను ఎదగలేననే భావనతో.. ఆ ముగ్గురిని టీడీపీ నుంచి సాగనంపడానికి కుట్రలు చేశారు. 1984 జనవరి 9 నాటికి ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీఎత్తున సభ నిర్వహించారు.
ఈ సభలో ఎన్టీఆర్‌పై మల్లెల బాబ్జీని ఉసిగొలిపి.. హత్యాయత్నం చేయించి.. ఆ నెపాన్ని తనపైకి నెట్టడానికి ప్రయత్నించారని నాదెండ్ల భాస్కర్‌రావు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత మల్లెల బాబ్జీకి ఇస్తానన్న రూ.3 లక్షల సుపారీ ఇవ్వకుండా చంద్రబాబు ద్రోహం చేశారని.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మల్లెల బాబ్జీ 1988లో ఆత్మహత్య చేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటుతో ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పకూలింది. దీనికి నిరసనగా ఎన్టీ రామారావు శాంతియుతంగా ప్రజా పోరాటం చేశారు.
కానీ.. ఎన్టీఆర్‌కు తెలియకుండా అప్పట్లో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించి.. అగ్నిగుండం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘ఒక చరిత్ర–కొన్ని నిజాలు’ పేరుతో రాసిన పుస్తకంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీ చేసేందుకు చంద్రబాబు జంకారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ దన్నుతో కర్షక పరిషత్ చైర్మన్‌గా దొడ్డిదారిన పదవి పొంది.. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారు. తన దోపిడీ గుట్టంతా నాటి సీఎం ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావుకు తెలిసినందున పక్కా ప్రణాళికతో ఆయన్ను మట్టుబెట్టించి.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారని అప్పట్లో టీడీపీ నేతలే ఆరోపించారు. అప్పట్లోనే ఓ వర్గం నేతలను చంద్రబాబు చేరదీసి వర్గ రాజకీయాలకు తెరతీశారని ఎన్టీఆర్‌కు సీనియర్ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు.
మహానేత సహకారంతో మంత్రి పదవి
దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో టి.అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన పట్ల కనీసం కృతజ్ఞత ప్రదర్శించని స్వార్థ పరుడని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక... 1983లో జరిగిన ఎన్నికల్లో తన మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు.. చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. రాజకీయ అస్థిత్వం కోసం మామను బతిమాలి టీడీపీలో చేరారు. వద్దని వారించినా అల్లుడనే కనికరంతో చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీశారని టీడీపీ సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
విద్యార్థి దశలోనే సం‘కుల’ సమరం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు.. విద్యార్థి దశలో తిరుపతిలోని గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సం‘కుల’ సమరాన్ని రాజేసి.. విద్యాలయాలను భ్రష్టుపట్టించారని నాటి సహ విద్యార్థులు చెబుతున్నారు. కుల రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. గల్లా రాజగోపాలనాయుడి శిష్యరికంతో 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం రాజకీయ భిక్ష పెట్టిన గల్లా రాజగోపాలనాయుడికి తీరని ద్రోహం చేశారనే విమర్శలు ఉన్నాయి.
తొమ్మిదేళ్ల పాలనలో ఏరులై పారిన రక్తం
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు.. 1995 – 2004 మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణిస్తూ వచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ను రాజేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన 415 మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యకమమ్యాయి. ఇలా హత్యకు గురైన వారిలో 300 మంది మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
రాజకీయ ప్రయోజనాల కోసం కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రక్కసిని రాజేసి వందలాది హత్యలకు కారణమయ్యారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కడప జిల్లాలో ఫ్యాక్షన్ తార స్థాయికి చేరడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కుట్రలు చేశారని టీడీపీ సీనియర్ నేతలే పలు సందర్భాల్లో ఆరోపించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే రీతిలో ప్రత్యర్థులను మట్టుబెట్టారనే విమర్శలు ఉన్నాయి. 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తనకు రక్షణ కల్పించాలని పరిటాల రవి కోరారు. కానీ.. పరిటాల రవికి భద్రత కల్పించలేదు. 2005లో పరిటాల రవి హత్యకు గురైన తర్వాత రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చేలా టీడీపీ శ్రేణులను ఉసిగొల్పడంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని.. జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయించారని ఆ పార్టీ సీనియర్ నేతలే వివిధ సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు.
జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్య
తమ అక్రమాలు, ఆగడాలను ప్రశి్నంచిన రాజకీయ నాయకుల్నే కాదు.. జర్నలిస్టులను సైతం టీడీపీ నేతలు మట్టుబెట్టారు. విజయవాడలో ‘ఎన్‌కౌంటర్’ అనే పక్షపత్రికకు పింగళి దశరథరామ్ వ్యవస్థాపక సంపాదకుడు, పబ్లిషర్‌గా వ్యవహరించేవారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అవినీతి, అక్రమాలను తన పత్రికలో ఎండగట్టారు. ఈ నేపథ్యంలో 1985 అక్టోబర్ 20వ తేదీ రాత్రి 9 గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురంలో రిక్షాలో వెళ్తున్న దశరథరామ్‌ను గూండాలు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య చేయించింది చంద్రబాబేనని ప్రజలు ఇప్పటికీ భావిస్తుంటారు.
వెన్నుపోటుతో ఎన్టీఆర్ కన్నుమూత
కుట్రలు, కుయుక్తులతో టీడీపీలో ఎదిగిన చంద్రబాబు.. 1995లో రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన మామ ఎన్టీఆర్‌కే ద్రోహం తలపెట్టి వెన్నుపోటు పొడిచారు. వైస్రాయ్ హోటల్‌లో నిర్బంధించిన తన ఎమ్మెల్యేలను విడిపించుకోవడానికి వచ్చిన ఎన్టీ రామారావుపై చెప్పులతో దాడి చేయించిన నైజం చంద్రబాబుది అన్నది జగది్వదితం. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది ఎన్.హరికృష్ణలను మభ్యపెట్టి.. వారి సహకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే వారిద్దరినీ టీడీపీ నుంచి సాగనంపారు.
చంద్రబాబుకు సహకరించి తప్పు చేశానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించిన ఘటనతో మరింత క్షోభకు గురై ఆ ఆవేదనతోనే కన్నుమూశారు. ఎన్టీఆర్ కన్ను మూయడానికి కొద్ది రోజుల ముందు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన నేర చరిత్రను ఎత్తిచూపాయి.
వంగవీటి రంగా హత్యలో కీలక పాత్ర
రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహనరంగా.. ప్రజా పోరాటాలతో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డుతొలగించుకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని చెబుతున్నారు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు తెలియకుండా కుట్ర చేసి.. 1988 డిసెంబర్ 26న ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న రంగాను అతి దారుణంగా హత్య చేయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ఏకరవు పెట్టారు.
మహానేత కుటుంబంపై ఎప్పుడూ కక్షే
► రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కుటుంబం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆ కుటుంబాన్ని కడతేర్చితే రాజకీయంగా తనకు తిరుగుండదని చంద్రబాబు భావించారని.. అందువల్లే వైఎస్ కుటుంబంపై కక్ష కట్టి.. మట్టుబెట్టేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
► 1999లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొంది. కడప జిల్లాపై వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి ముద్ర బలమైంది. ఆయన్ను హత్య చేస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డిని కడప జిల్లాకే పరిమితం చేయవచ్చునని.. తద్వారా ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవచ్చునని నాటి సీఎం చంద్రబాబు భావించారని చెబుతున్నారు. వైఎస్ రాజారెడ్డిని 1998 మే 23న పులివెందులకు సమీపంలో హత్య చేశారు. హత్య చేసిన వారికి నెల రోజులపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన అధికారిక నివాసంలోనే ఆశ్రయం కల్పించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డిని టీడీపీ ప్రభుత్వ హయాంలో క్షమాభిక్షపై విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతోంది.
► 2019 ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో సామాన్యులు ఎవరూ ప్రవేశించలేని వీఐపీ లాంజ్‌లో.. తనకు అత్యంత సన్నిహితుడైన నేతకు చెందిన రెస్టారెంట్లో పని చేసే ఉద్యోగి ద్వారా వైఎస్ జగన్‌ను కడతేర్చేందుకు 2018 అక్టోబర్ 25న కుట్ర చేశారు. హత్యాయత్నం నుంచి వైఎస్ జగన్ బయటపడ్డ తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనే ఈ కుట్రకు సూత్రధారి అనేలా ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
► 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి వేరుపడిన చంద్రబాబు.. అప్పట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తిరుపతిలో రాళ్లతో దాడి చేయించారు. ఇప్పుడు తన రాజకీయ జీవితానికి ముప్పు ఏర్పడటంతో పవన్ కళ్యాణ్‌తో కలిసి అమిత్ షాతో కాళ్లబేరానికి దిగి.. మళ్లీ బీజేపీ పంచన చేరారు. ఇలా అడుగడుగునా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నారు. తాజాగా దుష్టచతుష్టయంతో కలిసి చెలరేగిపోతున్నారు.
2014–19 మధ్య అధికారం అండతో హత్యాకాండ
► రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచి్చంది. 2014–19 మధ్య టీడీపీ పాలనలో సాగిన హత్యాకాండలో 30 మందికి పైగా వైఎస్సార్‌సీపీ నేతలను మట్టుబెట్టారు.
► 2014 జూలై 3న అనంతపురం జిల్లా యల్లనూరు
మండల వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రకాశం శెట్టిని టీడీపీ నేతలు హత్య చేశారు.
► 2014 ఆగస్టు 11న కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో వైఎస్సార్‌సీపీ గ్రామ పంచాయతీ ఉపసర్పంచి ఆలోకం కృష్ణారావు(55)ను టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. తర్వాత అదే గ్రామంలోని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపైనా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
► 2014 ఆగస్టు 21న గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన అన్నదమ్ములు బూసి పెదనాగిరెడ్డి, చిననాగిరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి చంపేశారు.
► 2014 ఆగస్టు 22న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత మల్లిఖార్జునను హత్య చేశారు.
► 2014 సెపె్టంబరు 1న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ప్రాణం తీశారు.
► 2014 సెపె్టంబర్ 11న గుంటూరు జిల్లా చినగార్లపాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త గోవింద్‌రెడ్డి హత్యకు గురయ్యాడు.
► 2014 నవంబర్ 27న కర్నూలు జిల్లా పలుకురులో వైఎస్సార్‌సీపీ నేత ప్రభాకర్‌నాయుడు హత్యకు గురయ్యారు.
► 2014 డిసెంబర్ 30న నెల్లూరు జిల్లాలో అల్లం నరేంద్రను హత్య చేశారు.
► 2015 మార్చి 31న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని సింగిల్ విండో కార్యాలయంలోనే టీడీపీ నేతలు కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలున్నాయి.
► 2015 ఏప్రిల్ 29న అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్‌సీపీ మండల మాజీ కనీ్వనర్ ప్రసాద్‌రెడ్డిని రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 12 రాజకీయ హత్యలు జరిగాయి.
► 2015 మే 15న కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వసంతరావుపై దాడి చేసి చంపేశారు.
► 2015 అక్టోబర్ 14న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చింతకుంటలో వైఎస్సార్‌సీపీ నేత రాఘవరెడ్డిని హత్య చేశారు.
► 2016 డిసెంబర్ 9న వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం అలవలపాడు ఎంపీటీసీ సభ్యుడు గజ్జెల రామిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మండల సర్వసభ్య సమావేశం ముగించుకొని వేంపల్లె నుంచి అలవలపాడు గ్రామానికి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు సుమోతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికి చంపారు.
► 2017 మే 6న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గోవిందపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, ఆయన బావ మరిదిని దారుణంగా హత్య చేశారు.
► 2017 మే 21న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని క్రిష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద హత్య చేశారు.
Comments
Please login to add a commentAdd a comment