రావికమతం: మాట తప్పని మడమ తిప్పని నేతగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. నాలుగు విడతల్లో రూ.25,552 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేసి అక్కచెల్లెమ్మల కళ్లలో ఆనందాన్ని చూస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆసరా నాల్గో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం కొత్తకోట హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు.
ఇక్కడ బహిరంగ సభలో ధర్మశ్రీ మాట్లాడుతూ నాడు చంద్రబాబు, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేఎస్‌ఎన్ రాజు బ్యాంకు రుణాలు చెల్లించొద్దని, తాకట్టు పెట్టిన బంగారం తెచ్చి ఇచ్చేస్తామని ప్రగల్భాలు పలికారని విమర్శించారు. గెలిచన తర్వాత ఎవ్వరికై నా తాకట్టు పెట్టిన బంగారం తెచ్చి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఆనాడు వారి మాటలు నమ్మి వడ్డీలు చెల్లించని వారికి అప్పులు తడిసిమోపుడయ్యాయని వాపోయారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలు మాఫీ చేశారన్నారు. నాడు జన్మభూమి కమిటీలు దోచుకున్నాయని దుయ్యబట్టారు.
నేడు ఏ నాయకుడైనా లంచాలు అడిగారా? మీరెవ్వరికై నా ఇచ్చారా అని ప్రశ్నించగా? లేదు.. లేదంటూ.. మహిళలు ముక్తకంఠంతో పలికారు. అనంతరం రావికమతం మండలానికి రూ.11.89 కోట్ల చెక్కు, రోలుగుంట మండలానికి రూ.7.27 కోట్ల చెక్కును డ్వాక్రా మహిళలకు అందించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీపీలు పైల రాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ రావికమతం మండలాధ్యక్షుడు ముక్కా మహలక్ష్మినాయుడు, డీసీఎంఎస్ డైరెక్టర్ గుమ్ముడు సత్యదేవ, జెడ్పీటీసీ తలారి రమణమ్మ ఆదిమూర్తి, చోడవరం ఏఎంసీ వైస్ చైర్మన్ రాజాన నర్సింహులు, కొత్తకోట సర్పంచ్ కోన లోవరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment