పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రమ్య | Sakshi
Sakshi News home page

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రమ్య

Published Tue, Jul 18 2023 4:22 AM

బిడ్డతో తల్లి రమ్య  - Sakshi

అనకాపల్లి: డోలీ మోతతో ఆస్పత్రిలో చేరిన గిరిజన మహిళ కథ సుఖాంతమైంది. పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. గొట్టివాడ శివారు అణుకు గిరిజన గ్రామానికి చెందిన తాంబెళ్ల రమ్య అనే గర్భిణికి నెలలు నిండి ఆదివారం పురిటినొప్పులు రావడంతో ఆందోళన చెందిన గిరిజనులు హుటాహుటిన డోలీలో మోసుకెళ్లి కోటవురట్ల ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.

సోమవారం తెల్లవారుజామున రమ్య ప్రసవించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. రమ్యకు రక్తం తక్కువగా ఉండడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. రమ్య, సూరిబాబు దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement