మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి అంజనాబాయి
బజార్‌హత్నూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు, ప్రత్యేక పోలీసు బలగాల మధ్య ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం డేడ్ర గ్రామానికి చెందిన మావోయిస్టు దాసర్వడ్ సుమన అలియాస్ రంజిత మృతదేహనికి శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 16న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ రీజియన్ కంకేర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఇందులో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన మావోయిస్టు సిరిపెల్లి శంకర్‌రావ్ మృతదేహంతో పాటు అతడి భార్య సుమన అలియాస్ రంజిత మృతదేహం ఉండటంతో శంకరావు కుటుంబసభ్యులు రెండు మృతదేహాలను ఒకే చోట ఖననం చేస్తామని విన్నవించారు. ఈ మేరకు వారికి శంకర్‌రావు, రంజితల మృతదేహాలను అప్పగించారు. విషయం తెలుసుకున్న రంజిత తల్లి అంజనాబాయి గురువారం రాత్రి తన సమీప బంధువుతో కలిసి అక్కడికి చేరుకుంది. బిడ్డ మృతదేహం ఉన్న శవపేటికమీద పడి బోరున విలపించింది. అనంతరం రెండు మృతదేహాలను ఖననం చేశారు. రంజిత మూడు దశాబ్దాల మావోయిస్టు ప్రస్తానం ముగిసినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment