● జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వివేకానంద
కై లాస్‌నగర్: ఎన్నికల ప్రచారానికి పార్టీ ద్వారా, అ భ్యర్థి తరఫున ఖర్చుచేసే ప్రతీ పైసా ఎన్నికల వ్య యం కింద నమోదు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్‌గంగ గెస్ట్‌హౌస్ నుంచి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ అకౌంటింగ్ టీం సభ్యులు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలన్నారు. ఎంసీఎంసీ ద్వారా ఎన్నికల్లో చేసిన ప్రకటనలకు ఈసీ విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయంగా నమోదు చేయాలన్నారు. అలాగే రోజువారిగా దినపత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్‌పై దృష్టి సారించాలని, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు అశిష్ సంగ్వాన్, వెంకటేష్ దోట్రే, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment