-
డబ్బుల కోసం బామ్మను చంపేశాడు
న్యూఢిల్లీ: జల్సాగా తిరగాలనే కోరికతో ఓ 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బులు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారా ఏరియాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు స్నేహితుడితో వారింటికి కలిసి వచ్చాడు. ఆ సమయంలో బామ్మ నిద్రిస్తుండటం గమనించి, దుప్పటితో ఆమెను ఊపిరాడకుండా గట్టిగా అదిమారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది. అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను తస్కరించి వెళ్లిపోయారు. కొద్దిసేపయ్యాక ఇంటికి చేరుకున్న వృద్ధుడు.. భార్య నిద్రలోనే చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి వృద్ధురాలి నుదుడి గాయం ఉన్న విషయాన్ని గుర్తించారు. బీరువా లాకర్లో డబ్బు మాయమైన విషయాన్ని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం మనవడిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. -
Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం
విన్నీపెగ్: ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబసభ్యుడిని కొట్టడం ఆ విమానాన్ని దారి మళ్లించేందుకు దారితీసింది. విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరాక గ్రాండ్ ప్రయరీస్కు చెందిన 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. వారి గొడవను విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. గాయపడిన వ్యక్తికి సిబ్బంది చికిత్స అందించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం విమానాన్ని విన్నీపెగ్కు అధికారులు దారి మళ్లించి, ఆ బాలుడిని అధికారులకు అప్పగించారు. ఇదంతా పూర్తయ్యేవరకు దాదాపు మూడు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచి్చంది. అనంతరం ఆ విమానం గమ్య స్థానం వైపు బయలుదేరిందని ఎయిర్ కెనడా తెలిపింది. -
వయసు 18 వృత్తి పైలెట్
సాక్షి కొచ్చర్‌కు ఇప్పటి దాకా స్కూటర్ నడపడం రాదు. కారు నడపడం రాదు. కాని ఏకంగా విమానం నడపడం నేర్చుకుంది. ప్రస్తుతానికి యంగెస్ట్ కమర్షియల్ పైలెట్ రికార్డ్ సాక్షి పేరున ఉంది. సంకల్పించాను... సాధించాను అంటోంది సాక్షి. మన దేశంలో అత్యంత చిన్న వయసులో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించిన రికార్డు మైత్రి పటేల్ పేరున ఉంది. ఆమె 19 ఏళ్ల లైసెన్స్ పొందింది. ఇప్పుడు 18 ఏళ్లకే సాక్షి కొచ్చర్ ఈ లైసెన్స్ పొంది మైత్రి రికార్డును బద్దలు కొట్టింది. సరిగ్గా ఆమె 18వ పుట్టిన రోజున ఈ లైసెన్స్ పొందడం విశేషం. పదేళ్ల వయసు నుంచే సాక్షి కొచ్చర్‌ది హిమాచల్ ప్రదేశ్‌కు ముఖద్వారం వంటిదైన పర్వాను టౌన్. అక్కడ తండ్రి లోకేష్ కుమార్ కొచ్చర్‌కు ఫుట్‌వేర్ వ్యాపారం ఉంది. పదేళ్ల వయసు నుంచి కుమార్తె పైలెట్ కావాలని కోరుకుంటూ ఉంటే అతడు ్ర΄ోత్సహిస్తూ వచ్చాడు. ‘పదో క్లాసు పరీక్షలు అయ్యాక నేను పైలెట్ కావాలని మళ్లీ ఒకసారి గట్టిగా చె΄్పాను. అయితే నాకు కామర్స్ లైన్లో చదవాలని ఉండేది. లెక్కలు పెద్దగా ఇష్టం లేదు. కాని పైలెట్ కావాలంటే ఎంపీసీ చదవాలని తెలిసి ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను’ అని చెప్పింది సాక్షి. ఇంటర్ అయిన వెంటనే ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్లో పీపీఎల్ (ప్రైవేట్ పైలెట్ లైసెన్స్)కు కావలసిన థియరీ క్లాసులను నాలుగున్నర నెలల పాటు చదవింది సాక్షి. ఈ క్లబ్‌లోనే కెప్టెన్ ఏ.డి.మానెక్ దగ్గర ఏవియేషన్ పాఠాలు నేర్చుకుంది మైత్రి పటేల్. సాక్షి కూడా కెప్టెన్ మానెక్ దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత సీపీఎల్ (కమర్షియల్ పైలెట్ లైసెన్స్) కోసం అమెరికా వెళ్లింది. 70 లక్షల ఖర్చు అమెరికాలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందాలంటే దాదాపు 70 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా సరే సాక్షి కుటుంబం ఆ ఖర్చును భరించి సాక్షిని అమెరికా పంపింది. అక్కడ మూడు నెలల పాటు సాక్షి ట్రైనింగ్‌లో పాల్గొంది. ‘ఇన్స్ట్రక్టర్ సహాయంతో విమానం నడపడంలో ఒక రకమైన థ్రిల్ ఉంది. కాని ట్రైనింగ్‌లో భాగంగా మొదటిసారి సోలో ఫ్లయిట్ (ఇన్స్ట్రక్టర్ లేకుండా) ఒక్కదాన్నే విమానం నడిపినప్పుడు కలిగిన థ్రిల్, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఆ క్షణం నా జీవితంలో అలాగే ఉండి ΄ోతుంది’ అని చెప్పింది సాక్షి. ‘అయితే పైలెట్ కావడం అనుకున్నంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉంటాయి. నా ట్రయినింగ్లో ఒకసారి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది. మరోసారి రేడియో ఫెయిల్ అయింది. నేను కంగారు పడకుండా అలాంటి సమయంలో ఏం చేయాలో అది చేసి సేఫ్ లాండింగ్ చేశాను’ అని తెలిపింది సాక్షి. పైలెట్‌గా ఉద్యోగం ‘మా ఊళ్లో నేను పైలెట్ అవుతానని అంటే మా బంధువులు చాలామంది ఎయిర్ హోస్టెస్ అనుకున్నారు. అమ్మాయిలు పైలెట్లు కావచ్చునని వారికి తెలియదు. ఇవాళ మన దేశంలో ఎక్కువమంది మహిళా పైలెట్లు ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. నాకు పైలెట్‌గా ఉద్యోగం రాగానే నా కోర్సు కోసం అయిన ఖర్చు మొత్తం అణాపైసలతో సహా మా అమ్మానాన్నలకు చెల్లిస్తాను’ అంది సాక్షి. ఇంత చిన్న వయసులో లైసెన్స్ పొందిన సాక్షికి ఉద్యోగం రావడం ఎంత సేపనీ. -
టిక్‌టాక్.. 60 నిమిషాలే 18 ఏళ్లలోపు వారికి వర్తింపు
వాషింగ్టన్: టిక్‌టాక్ వల్ల వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు యాప్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు యూజర్లు ఒకరోజులో కేవలం ఒక గంటపాటే యాప్‌ను వినియోగించేలా పరిమితి విధించినట్లు టిక్‌టాక్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అధినేత కార్మాక్ కీనన్ బుధవారం ప్రకటించారు. గంట సమయం దాటిన తర్వాత వీడియోలు ఆగిపోతాయని తెలిపారు. గంట తర్వాత మళ్లీ యాప్‌లో వీడియోలు చూడాలంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇక 13 ఏళ్లలోపు యూజర్లు పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మరో 30 నిమిషాలపాటు మాత్రమే వీడియోలు తిలకించేందుకు వీలుంటుందని, ఆ తర్వాత ఆగిపోతాయని పేర్కొన్నారు. -
శ్రుతి మించిన ప్రేమ
పబ్జీకి బానిసై తల్లిని కాల్చి చంపిన కుర్రాడు, పరీక్షలను వాయిదా వేయించడానికి ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన పన్నెండవ తరగతి కుర్రాడు, అంతకు ఐదేళ్ల ముందు నిర్భయ సంఘటన, ఆ తర్వాత రెండేళ్లకు హైదరాబాద్‌లో అభయ ఘటన, మరో ఐదేళ్లకు అదే హైదరాబాద్‌లో ఒక దిశ, ఇప్పుడు ఒక రొమేనియా బాలిక...నెక్లెస్ రోడ్లో మరో ఉదంతం. వీటన్నింటిలోనూ అన్నింటిలోనూ నిందితులు టీనేజ్ దాటుతున్న వాళ్లు, యువతరానికి ప్రతినిధులే. అభివృద్ధి సాధిస్తున్నాం, డిజిటల్‌గా ముందుకు వెళ్తున్నాం... అనుకుంటున్న ఈ రోజుల్లో అత్యాచారాలు, కరడు కట్టిన నేరాలకు యువతరమే కారణమవుతోందంటే ఈ తప్పు ఎవరిది? తప్పంతా సమాజానిదేనా? పేరెంట్స్ పాత్ర ఎంతవరకు? ప్రేమ – బాధ్యత ఈ రెండూ పేరెంటింగ్‌లో ప్రధానమైనవి. పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుతున్నామనే ప్రదర్శన ఎక్కువవుతున్న రోజులివి. ఈ ప్రదర్శనలో మునిగిపోయి తమ మీద ‘బాధ్యత’ కూడా ఉందనే వాస్తవాన్ని మర్చిపోతున్న పేరెంట్స్ కూడా ఎక్కువవుతున్నారనే చెప్పాలి. ► ఒక ఆర్టీఏ అధికారి తన పదిహేడేళ్ల కూతురు బైక్ తీసుకుని రోడ్ మీదకు వెళ్తున్నప్పుడు ‘ట్రాఫిక్ పోలీస్ ఆపితే నా పేరు చెప్పు, అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి’ అని చెప్పి పంపిస్తే దానిని ప్రేమ అనవచ్చా? బాధ్యతరాహిత్యం అనాలా? ఈ రెండూ కాకపోతే అధికారంతోపాటు వచ్చిన అతిశయం అనుకోవాలా? ► అనతి కాలంలోనే బాగా సంపాదించిన ఓ తండ్రి తన కొడుకుతో ‘ఈ వయసులో నేను కెరీర్లో స్థిరపడడానికి అహోరాత్రులు కష్టపడ్డాను. నీకు ఆ కష్టం అవసరం లేదు, నా లైఫ్‌ని కూడా నువ్వే ఎంజాయ్ చెయ్యి’ అని అవసరానికి మించినంత డబ్బు ఇవ్వడాన్ని ఏ విధమైన పేరెంటింగ్‌గా పరిగణించాలి? ► ‘నువ్వు ఏదైనా చెయ్యి, అయితే! ఏం చేశావో చెప్పేసెయ్, తర్వాత ఏ తలనొప్పులూ రాకుండా నేను చూసుకుంటాను’ అని ఒక నాయకుడు తన పిల్లలతో చెప్పడాన్ని ఎలా చూడాలి? ► ‘మా అమ్మాయి ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ చాలా గొప్పవాళ్లు. తనకు కారు లేదని చిన్నబుచ్చుకుంటోంది. అందుకే తన కోసం ఓ కారు బుక్ చేశాం’ అని చెప్పుకునే ఓ తల్లి. ఆ మైనర్ అమ్మాయి బైక్ యాక్సిడెంట్ చేస్తే అందుకు మూల్యం చెల్లించాల్సింది అమాయకులే కదా! ఆ సంపన్న కుర్రాడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటే సదరు అమ్మాయిల జీవితాన్ని, జీవించే హక్కును కాలరాసిన నేరం ఎవరిది? పై తల్లిదండ్రులందరికీ తమ పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉంది. అందులో సందేహం లేదు. ఆ ప్రేమ వెనుక ఉండాల్సిన బాధ్యత ఏమవుతోంది? మద్యం సేవించి కారు నడిపితే జరిగే ప్రమాదాల గురించి చెప్పాలని, మద్యం సేవించి కారు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి, ఆ ప్రమాదం తమకు ఎదుటి వారిని కూడా ప్రాణాపాయంలోకి నెట్టివేస్తుంది కాబట్టి ఆ సమయంలో వాహనం నడప వద్దని, అలా నడపడం చట్టరీత్యా నేరమని చెప్పడం మర్చిపోతున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే పోలీసులు ఆపుతారు, కాబట్టి పోలీసులకు దొరకకుండా ఉండడానికి చిట్కాలు నేర్పిస్తున్నారు. ఇంటికి మెయిన్రోడ్లో రాకుండా పోలీసు నిఘా, సీసీ కెమెరాల్లేని గల్లీల్లో ఎలా రావాలో జాగ్రత్తలు చెప్తున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండడం నేర్పిస్తున్నారు, పోలీసులు ఆపినప్పుడు ఎలా బయటపడాలో నేర్పిస్తున్నారు తప్ప ఆ పొరపాటు మీరు చేయవద్దు అని చెప్పే వాళ్లు ఎంతమంది? ఉద్యోగం– ఒత్తిడి జీవితాన్ని చక్కగా దిద్దుకోవాలి, పిల్లల్ని సౌకర్యంగా పెంచాలి, మంచి చదువు చెప్పించాలి... మధ్యతరగతి పేరెంట్స్ వీటన్నింటినీ ప్రధాన కర్తవ్యాలుగానే చూస్తున్నారు. అయితే ఒక కార్పొరేట్ స్కూల్లో చేర్చడంతో తమ బాధ్యత పూర్తయినట్లు భావిస్తున్నారు. నిజానికి ఏ స్కూలూ పేరెంటింగ్ రోల్ పోషించలేదు. ఆ బాధ్యత పేరెంట్స్‌దే. తమ పిల్లలకు స్నేహితులెవరనేది ప్రతి పేరెంట్‌కి తెలిసి ఉండాలి. పిల్లలను ఇంట్లో బంధించినట్లు పెంచడమూ కరెక్ట్ కాదు, అలాగని పార్టీలకు వెళ్తుంటే... గుడ్డిగా వదిలేయనూకూడదు. ఆ పార్టీ జరిగే ప్రదేశం తెలిసి ఉండాలి. అది బర్త్‌డే పార్టీ కావచ్చు, ఫేర్వెల్ కావచ్చు. పార్టీ జరిగే చోట పిల్లల్ని డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం తల్లిదండ్రులే చేస్తుంటే అనేక ఘోరాలకు అడ్డుకట్ట పడుతుంది. అంతకంటే ముందు మద్యం సేవించడం అభ్యుదయానికి చిహ్నం అనే అపోహను తొలగించాలి. అలాగే మంచి– చెడు చెప్పడం, సంస్కారం నేర్పించడంతోపాటు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాల గురించి అవగాహన కల్పించాలి. న్యాయవ్యవస్థ మీద గౌరవం తల్లిదండ్రులలో ఉండాలి. అప్పుడే పిల్లలకు నేర్పడం సాధ్యమవుతుంది. చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడితే ఎదురయ్యే పర్యవసానాలను తెలియచెప్పాలి తప్ప తప్పించుకోవడానికి ఉన్న మార్గాలను కాదు. అన్నింటికంటే ఈ తరం పిల్లలకు ఇంట్లో వాళ్ల భయం తక్కువగా ఉంటోంది. అమ్మానాన్నలను సులువుగా ఏమార్చవచ్చనే ధోరణి కూడా పెరిగింది. దొరికిపోతామేమోననే భయం లేకుండా సులువుగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. అలాగే హింసలో ఆనందాన్ని వెతుక్కునే దారుణమైన మానసిక స్థితి కూడా పెరిగింది. దీనికి బాల్యంలో వీడియోగేమ్‌ల రూపంలో బీజాలు పడుతున్నాయి. ఒకటి– ఒకటి కలుస్తూ సమస్య పెనుభూతంలా విస్తరిస్తోంది. తరం మారిన వైనం ఒక్కసారి వెనక్కి చూసుకుంటే... గడచిన తరాలు పాటించిన పేరెంటింగ్ వాల్యూస్ పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు ఎలా ఉండాలో తల్లిదండ్రులు కచ్చితంగా చెప్పేవారు. పిల్లల్ని పై చదువులకు బయటకు పంపించేటప్పుడు ‘గౌరవానికి భంగం కలిగే పనులకు పాల్పడవద్దు’ అని హితవు చెప్పేవారు. ‘మీరు తప్పు చేస్తే మేము తలవంచుకోవాల్సి వస్తుంద’ని పిల్లలకు బాధ్యత గుర్తు చేసేవాళ్లు. ఆడపిల్లల విషయంలో ఎంత హుందాగా వ్యవహరించాలో చెప్పేవాళ్లు. ఇప్పుడు పిల్లల్లో షేరింగే కాదు, తోటి వారి పట్ల కేరింగ్, సర్దుబాటు కూడా కొరవడింది. తాము కోరుకున్నది, కోరుకున్న క్షణంలోనే అందాలి. ‘నేను, నా ఎంజాయ్మెంట్’ అనే సెల్ఫ్ సెంట్రిక్ ధోరణి ఎక్కువవుతోంది. టీనేజ్ పిల్లల్లో, యువతలో పెరుగుతున్న హింసాప్రవృత్తికి, జరుగుతున్న నేరాలకు ఇవన్నీ తెరవెనుక కారణాలే. త్రిబుల్ రైడింగ్లోనో, హెల్మెట్ లేదనే కారణంతోనో పోలీసు ఆపితే తండ్రి పేరు చెప్పడానికి భయపడేది గత తరం. తండ్రికి తెలిస్తే కోప్పడతారనే భయం అది. ఇప్పుడు ‘నన్నే ఆపుతావా! మా నాన్న ఎవరో తెలుసా?’ అని ఓ టీనేజ్ కుర్రాడు పోలీసు మీద హుంకరించాడంటే తప్పు పట్టాల్సింది ఎవరిని? ఎవరినో తప్పు పట్టడం కాదు, ఆత్మ పరిశీలన, ప్రక్షాళన ఇంటి నుంచే మొదలుకావాలి. ఒంటరిగా వదలవద్దు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. పైగా చాలా కుటుంబాలు ఒన్ ఫ్యామిలీ– ఒన్ కిడ్ పాలసీనే అనుసరిస్తున్నాయి. అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిన ఇళ్లలో పిల్లలు ఒంటరిగా గడిపే సమయం పెరుగుతోంది. ఇది డిజిటల్ ఎరా, ప్రపంచం అరచేతిలోనే ఉంటోంది. ఇంట్లో ఖాళీగా ఉంటే ఆ వయసు పిల్లలు చూడకూడనివెన్నో చూస్తారు. స్నేహితులను ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. అవసరానికి మించిన ప్రైవసీ కూడా ప్రమాదమే. ఒక సంఘటనను లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఇలాంటి అసలు నిజాలెన్నో. ఒక దారుణం జరిగిందంటే ఆ నాలుగైదు రోజులు చర్చించుకుని ఆ తర్వాత మర్చిపోవడం సహజం. కానీ అలాంటి దుష్ప్రభావాలకు లోనుకాకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. – వాకా మంజులారెడ్డి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement