-
ఐస్‌బాత్ చేస్తున్న తెలుగు హీరోయిన్
కథానాయకిలకు అందం, ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకోసం వాళ్లు నిరంతరం వ్యాయామం, యోగాలు అంటూ కసరత్తులు చేయడం తప్పనిసరి. అందుకు కొత్త కొత్త యోగాలను కనిపెడుతుంటారు. నటి సునైనా అలాంటి కొత్త యోగాను చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత నటిగా పరిశ్రమకు పరిచయం అయిన అచ్చ తెలుగు అమ్మాయి సునైనా. తమిళంలో కాదలిల్ విళిందేన్ చిత్రం ద్వారా నటుడు నకుల్‌కు జంటగా కథానాయకిగా పరిచయం అయిన సునైనా తొలి చిత్రం తోనే మంచి విజయాన్ని చవి చూశారు. ఈ చిత్రం 2008లో విడుదల అయ్యింది. ఆ తరువాత ఈ జంట మాచిలామణి అనే మరో చిత్రంలోనూ నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ అంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత వీరి కలిసి నటించలేదు. కాగా నటి సునైన మాత్రం నీర్ పరవై, వంశం వంటి పలు చిత్రాల్లో నటించినా స్టార్ డమ్ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఈమె చివరిగా నటుడు విశాల్ సరసన లాఠీ చిత్రంతో పాటు రెజీనా అనే హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రంలో నటించారు. కొన్ని వెబ్ సిరీస్‌లోనూ నటించిన సునైనా ఇప్పుడు అరుదైన యోగాసనంతో వార్తల్లో కెక్కారు. ఫిట్‌నెస్‌లో భాగంగా ఈ భామ ఐస్ మెడిటేషన్ చేస్తుండడం విశేషం. సాధారణంగా ఒంటిలోని నరాలను బలపరచుకోవడం కోసం శరీర బడలికను తగ్గించుకోవడం కోసం ఐస్‌బాత్ చేస్తుంటారు. అలాంటిది నటి సునైన మాత్రం ఐస్ మెడిటేషన్ చేస్తున్నారు. ఒక టబ్‌లో ఐస్ ముక్కల నడుమ ఈమె యోగా చేశారు. దీంతో ఈమె మెడిటేషన్ చేస్తున్న వీడియో, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) -
క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన రెజీనా
సాక్షి, సినిమా : ప్రస్తుతం సినీ పరిశ్రమని క్యాస్టింగ్ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటన(చికాగో సెక్స్ రాకెట్)లు కుదిపేస్తున్నాయి. దీనిపై వర్ధమాన నటీమణులకు నటి రెజీనా ఓ సలహా ఇచ్చారు. చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ బాధితులేనని ఒక్కొక్కరూ ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. దీని గురించి నటి రెజీనా ఏమన్నారో చూద్దాం.. ‘క్యాస్టింగ్ కౌచ్, అమెరికాలో అమ్మాయిల వ్యభిచారం సంఘటనలపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటమే మంచిదని నేను భావిస్తున్నాను. నిజంగా అలాంటి ప్రచారంలో వాస్తవాలు ఉంటే ఏదో ఒక రోజున చర్యలు తీసుకోవలసిందే. దీని గురించి నేనేమైనా స్పందిస్తే దాన్ని వేరేగా చిత్రీకరిస్తారు. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తమకు ఇష్టం వచ్చిన విధంగా కొందరు మాట్లాడుతుంటారు. అలాంటి వాటిలో ఏది నిజం అన్నది మీడియా నిర్ధారించుకుని ప్రసారం చేయాలి. ఎందుకంటే మీడియా ప్రసారాలను నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందుకే ఇలాంటి వ్యవహారాల గురించి ప్రసారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటనల నుంచి వర్ధమాన తారలు పాఠం నేర్చుకుని వాటికి దూరంగా ఉండాలన్నదే నా సలహా’ అని రెజీనా చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement