-
మెగాస్టార్ సాంగ్‌లో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ.. తొలిసారి ఇలా
గౌహర్ ఖాన్.. బాలీవుడ్లో ఆమె పేరు చాలా పాపులర్. బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్,టీవీ స్టార్,మోడల్,హీరోయిన్ ఇలా పలు రంగాల్లో రాణించిన ఆమె కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్‌ను 2020లో ప్రేమించి వివాహం చేసుకుంది. గతేడాది పండంటి బిడ్డకు వారు జన్మనిచ్చి జెహాన్ అనే పేరు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు బాబు ఫోటోలను వారు విడుదల చేయలేదు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు పరమ పవిత్రమైన నగరం మక్కా క్షేత్రంలో బాబు ఫోటోను రివీల్ చేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో తెలుగు వారికి గౌహర్ ఖాన్ సుపరిచయమే. ఇందులో 'నాపేరే కాంచనమాల' అనే స్పెషల్ సాంగ్‌తో అభిమానులను ఓ రేంజ్లో ఆమె అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్ బ్యూటీ గౌహార్ ఖాన్. 18 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ ఆరంభించిన గౌహర్‌ఖాన్ పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె పలు సీరియల్స్‌లోనూ నటించారు. గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాలతో పాటు తాండవ్ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరును తెచ్చాయి. ఆమె పెళ్లి నాటికి వారి వయసు గౌహర్ ఖాన్(37), కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్(25). గౌహర్ ఖాన్ కంటే జైద్ దర్బార్ 12 ఏళ్లు చిన్నవాడు కావడంతో వారి పెళ్లి గురించి పలు విమర్శలు వచ్చాయి. కానీ పెళ్లి తర్వాత వారు ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు పలు ఫోటోలతో పంచుకుంటూ వచ్చారు. గతేడాది మే నెలలో ఒక బాబుకు జన్మనిచ్చినట్లు వారు ఎంతో సంతోషంగా ఆ వార్తను పంచుకున్నారు. బాబును తొలిసారిగా పవిత్ర స్థలమైన మక్కాకు తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది. అతనికి నిరంతర సానుకూలత, ప్రేమ, ఆశీర్వాదం ఇవ్వాలని ఫ్యాన్స్‌ను వారు కోరారు. View this post on Instagram A post shared by Gauahar Khan (@gauaharkhan) -
చిరంజీవి సినిమాతో ఫేమస్ అయిన బ్యూటీ కొత్త కారు చూశారా? (ఫోటోలు)
-
చిరంజీవితో స్టెప్పులేసిన బ్యూటీ.. ఇప్పడు కారు కొన్న ఆనందంలో..
ప్రముఖ నటి 'గౌహర్ ఖాన్' (Gauahar Khan) ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె కొన్న ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నా పేరే కాంచనమాలా పాటతో శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవితో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన 'గౌహర్ ఖాన్' కొనుగోలు చేసిన లగ్జరీ కారు 'మెర్సిడెస్ బెంజ్' కంపెనీకి చెందిన 'జీఎల్ఈ'. ఈ కారు ధర సుమారు రూ. కోటి కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కారుని డెలివరీ చేసుకోవడానికి సంబంధించిన ఫోటోలను ముంబైలోని కంపెనీ అధీకృత మెర్సిడెస్-బెంజ్ డీలర్ అయిన ఆటోహంగర్ అండ్ గ్లామర్ డైరీస్ ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియోలో గమనించినట్లైతే గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్తో కలిసి ముంబైలోని మెర్సిడెస్-బెంజ్ డీలర్‌షిప్‌లోకి వెళ్లడాన్ని చూడవచ్చు. లగ్జరీ కారుని మాత్రమే కాకుండా వీరు తమ పిల్లల కోసం ఓ బొమ్మ బెంజ్ కారుని కొన్నట్లు తెలుస్తోంది. వీడియోలో ఈ చిన్న కారు కూడా పార్క్ చేసి ఉండటం చూడవచ్చు. గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్ ఇద్దరూ బొమ్మ కారుని ఆవిష్కరించిన తరువాత, బెంజ్ కారుని ఆవిష్కరించారు. ఇది బెంజ్ GLE300d LWB వెర్షన్ అని తెలుస్తోంది. ఇది మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదీ చదవండి: ఆ రోజు మీటింగ్‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస.. బ్లాక్ షేడ్‌లో కనిపించే ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగి 245 పీఎస్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9జీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తుంది. View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
ఘనంగా నటి గౌహర్ ఖాన్ సీమంతం
-
గ్రాండ్‌గా బాలీవుడ్ నటి సీమంతం, ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ బ్యూటీ గౌహర్ ఖాన్ త్వరలో తల్లి కాబోతోంది. డిసెంబర్లో ఈ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాం అంటూ గౌహర్, ఆమె భర్త జైద్ దర్బార్.. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఆదివారం నటి సీమంతం ఘనంగా జరిగింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను గౌహర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ప్రత్యేకమైన వ్యక్తుల మధ్య, రుచికరమైన భోజనంతో, అమితమైన ప్రేమాభిమానాల మధ్య నా సీమంతం వేడుక సంతోషంగా జరిగింది' అని చెప్పుకొచ్చింది. ఈ సెలబ్రేషన్స్‌లో గౌహర్ మల్టీకలర్ లెహంగా ధరించగా జైద్ అందుకు మ్యాచింగ్ షర్ట్ వేసుకున్నాడు. ఫ్రెండ్స్‌తో, అలాగే బోలెడన్ని కేక్స్ మధ్య వీరు దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గౌహర్ ఖాన్ రాకెట్ సింగ్: సేల్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించింది., గేమ్, 14 ఫెరే.. వంటి పలు చిత్రాల్లో నటించింది. ఝలక్ దిఖ్ లాజా 3, బిగ్‌బాస్ 7, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 5 వంటి రియాలిటీ షోలలనూ పాల్గొంది. తాండవ్, సాల్ట్ సిటీ, శిక్షా మండల్ వెబ్ సిరీస్‌లలో నటించింది. ఇటీవలే నెట్‌ప్లిక్స్‌లో ప్రసారమైన ఇన్ రియల్ లవ్ షోలో రణ్విజయ్ సింగ్‌తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రముఖ గాయకుడు, కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్ కుమారుడైన జైద్ దర్బార్‌ను 2020 డిసెంబర్లో పెళ్లాడింది. View this post on Instagram A post shared by Gauahar Khan (@gauaharkhan) చదవండి: నేను చనిపోలేదు, బతికే ఉన్నా: ధనుస్ సోదరుడు అల్లరి నరేశ్ ఉగ్రం ట్విటర్ రివ్యూ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement