-
ఫైన్డ్.. అన్ని బ్రాండ్లూ ఇక్కడే!
♦ అంతర్జాతీయ బ్రాండెడ్ దుస్తుల వేదిక ♦ 7,600 స్టోర్లలో 220 బ్రాండ్లతో డీల్ ♦ సౌదీ, ఆగ్నేయాసియా దేశాలకు విస్తరణ ♦ రూ.20 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ♦ ‘స్టార్టప్ డైరీ’తో ఫైన్డ్ కో–ఫౌండర్ హర్ష్ షా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అలెన్ సోలీ, టామీ హిల్ఫిగర్, అమెరికన్ ఈగల్, పూమా, బీయింగ్ హ్యూమన్, లీ... ఇవన్నీ టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ అన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటిని ఆన్లైన్లో కొనాలంటే కాస్త ఆలోచిస్తాం. కారణం.. ఆన్లైన్లో బ్రాండెడ్‌తో పాటూ స్థానిక దుస్తులూ ఉండటమే!! కానీ, బ్రాండెడ్ దుస్తులకు మాత్రమే వేదికగా నిలుస్తోంది ఫైన్డ్. ఒకటి కాదు రెండు కాదు దేశ, విదేశాల్లోని 220 బ్రాండ్ల దుస్తులు లభించడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ హర్ష్ షా మాటల్లోనే.. బ్రాండెడ్ ఫ్యాషన్ ఉత్పత్తులను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకూ చేరువ చేయాలనే ఉద్దేశంతో గతేడాది జనవరిలో రూ.6 కోట్ల పెట్టుబడులతో ఫారూఖ్ ఆదాం, శ్రీరామన్ ఎంజీతో కలసి ముంబై కేంద్రంగా ఫైన్డ్ (www.gofynd.com)ను ప్రారంభించాం. ప్రస్తుతం దేశంలోని 7,600 స్టోర్లలో 220 బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాం. 60 వేల ఉత్పత్తులున్నాయి. త్వరలోనే మరో 140 బ్రాండ్లతో ఒప్పందం చేసుకుంటాం. ప్రస్తుతం మహిళలు, పురుషులకు సంబంధించిన దుస్తులు, పాదరక్షలు, జ్యుయలరీ, యాక్సెసరీలను మాత్రమే విక్రయిస్తున్నాం. మరో 2 నెలల్లో పిల్లల విభాగంలోకీ విస్తరిస్తాం. ఇటీవలే ఇన్–స్టోర్ సేవలను ప్రారంభించాం. ఇదేంటంటే.. ఒప్పందం చేసుకున్న స్టోర్లలోకి వచ్చిన కస్టమర్లకు వారికి నచ్చిన రంగులు, ఫ్యాషన్ ఉత్పత్తులు లేకపోతే వాటిని స్థానికంగా ఉన్న ఇన్–స్టోర్‌లో నమోదు చేస్తే చాలు. నేరుగా కస్టమర్ల ఇంటికి డెలివరీ చేస్తాం. రోజుకు 2,500–3,000 ఆర్డర్లు.. ప్రస్తుతం 32 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజూ 35–40 వేల మంది యాడ్ అవుతున్నారు. రోజుకు 2,500–3,000 ఆర్డర్లొస్తున్నాయి. కనీస ఆర్డర్ విలువ రూ.1,500. ప్రతి ఆర్డర్‌పై 20–30 శాతం విక్రయదారుడి నుంచి కమిషన్ తీసుకుంటాం. గతేడాది ఫైన్డ్ ద్వారా రూ.34 కోట్ల అమ్మకాలు జరిగాయి. కమిషన్ రూపంలో రూ.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ఐదు కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రెండు రోజుల్లో డెలివరీ చేస్తాం. ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం.. ప్రస్తుతం 80 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగిసేలోగా 400 బ్రాండ్లకు, 60 లక్షల కస్టమర్లకు, రూ.90 కోట్ల జీఎంవీకి చేరుకోవాలని లక్ష్యించాం. మా మొత్తం వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 40–45%. అందులో ఏపీ, తెలంగాణ వాటా 15%. ఈ మధ్యే ఐఐఎఫ్ఎల్ సీడ్ వెంచర్స్, కేఏఈ క్యాపిటల్స్ నుంచి రూ.20 కోట్ల నిధులను సమీకరించాం. వీటిని విదేశీ విస్తరణకు ఉపయోగిస్తున్నాం. వచ్చే ఏడాది గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాల్లో సేవలను ప్రారంభిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
డిస్కౌంట్ సేల్‌లో కొంటా!
న్యూ ఇయర్ సేల్, సంక్రాంతి సేల్, ఉగాది సేల్, దీపావళి సేల్... ఇలా పండగల సమయంలో పెట్టే డిస్కౌంట్ సేల్స్‌కి చాలా డిమాండ్ ఉంటుంది. చాలామందిని ఈ ఆఫర్స్, సేల్స్ ఎట్రాక్ట్ చేస్తాయి. వారిలో శ్రుతీహాసన్ ఒకరు. కథానాయికగా కోట్లు సంపాదిస్తున్న శ్రుతీహాసన్ కూడా డిస్కౌంట్ సేల్స్‌పై మొగ్గుచూపుతారట. సేల్లోబ్రాండెడ్ దుస్తులు లేకపోయినా కొనుక్కుంటారట. ఆ మాటకొస్తే.. అసలు బ్రాండెడ్ దుస్తులనే శ్రుతి ప్రిఫర్ చేయరట. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘నాకు బ్రాండెడ్ దుస్తులు వేసుకోవడం ఇష్టం ఉండదు. అప్పుడప్పుడూ బ్రాండెడ్ డ్రెస్సుల్లో కనిపిస్తాను కదా. అవన్నీ నేను కొనుక్కున్నవి కాదు. గిఫ్ట్‌గా వచ్చినవే. అలాగే నేనెక్కువగా డిస్కౌంట్ సేల్స్‌లో బట్టలు కొంటుంటాను. రిచ్‌గా కనిపించడానికి బ్రాండెడ్ డ్రెస్సులే వేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి కలర్ కాంబినేషన్, శరీరాకృతికి తగ్గ డ్రెస్ సెలక్ట్ చేసుకుంటే చాలు. మామూలు డ్రెస్సుల్లో కూడా గ్రాండ్‌గా కనిపించవచ్చు. నాకు నచ్చని డ్రెస్‌లు ఎంత ఫ్యాషన్‌గా ఉన్నా, భారీ రేటు ఉన్నా, ఏ బ్రాండ్ అయినా వేసుకోను. ట్రెండ్‌కి తగ్గట్టు మారాలని ఫ్రెండ్స్ చెప్పినా నాకు నచ్చినట్టే, సౌకర్యంగా అనిపించే దుస్తులే ధరిస్తా’’ అని చెబుతున్నారు శ్రుతీహాసన్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement