-
నిజం చెప్పిన ఆస్ట్రేలియా పీఎంకు థ్యాంక్స్: ట్రంప్
వాషింగ్టన్: పుండుమీద కారంజల్లి వెన్నముద్ద తినిపించినట్లుంది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌ను తొలుత చెడమడా తిట్టి ఇప్పుడు బుజ్జగింపు చర్యలకు దిగారు. అంతకంటే ముందు టర్న్‌బుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి ఆయన నిజాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని, కానీ, మీడియానే వాటిని వక్రీకరించిందంటూ గుర్రుమన్నారు. మరోపక్క, గతంలో శరణార్థుల విషయంలో అమెరికాతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకుందామని హామీ ఇస్తూ అమెరికా పరిపాలన వర్గానికి చెందిన ఇద్దరు ఉన్నత సలహాదారులు ట్రంప్ స్టాఫ్ చీఫ్ రెయిన్స్ ప్రీబస్, మరో సీనియర్ సలహాదారు స్టీవ్ బ్యానన్‌ను ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రతినిధి వద్దకు పంపించారు. ఈ వివరాలు వారిద్దరే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తాము ఆస్ట్రేలియా ప్రతినిధి జో హాకీతో కూడా భేటీ అయ్యి వివరాలు తెలియజేసినట్లు చెప్పారు. ఒబామా హయాంలో కుదుర్చుకున్న శరణార్థుల ఒప్పందంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో వాగ్వాదానికి దిగి మధ్యలోనే ఫోన్ పెట్టేశారు. అధ్యక్షుడయ్యాక వరుసగా ప్రపంచదేశాల అధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్... ఇంతవరకూ తాను మాట్లాడిన ఫోన్ కాల్స్‌లో ఇదే అత్యంత చెత్తదిగా పేర్కొన్నారంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఈ వ్యవహారంపై స్పందించారు. అలాగే ఇరాన్ విషయంలో కూడా స్పందిస్తూ తాను నిప్పుతో ఆడుకుంటుందన్న విషయం ఇరాన్ మర్చిపోతుందంటూ గట్టిగా మందలించారు. ఇరాన్ అణు క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటంతోపాటు తాము కూడా అమెరికన్లపై ఆంక్షలు విధిస్తామని చెప్పిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మరిన్ని సంబంధిత కథనాలకు చదవండి.. (ఇదెక్కడి ‘ట్రంపు’ నోరు!) (దేశ ప్రధానికి ఫోన్ చేసి షాక్ ఇచ్చిన ట్రంప్!) (‘మాది ఒబామా సర్కార్ కాదు.. సంగతి తేలుస్తాం’) (డోనాల్డ్ ట్రంప్ రికార్డు ఢమాల్) -
ఇదెక్కడి ‘ట్రంపు’ నోరు!
ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌తో వాగ్వాదం ► మధ్యలోనే ఫోన్ పెట్టేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ► అత్యంత చెత్త ఫోన్ కాల్ ఇదేనని ట్రంప్ వ్యాఖ్య! వాషింగ్టన్ /కాన్ బెర్రా: తాను చేసిందే చట్టంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తాను చెప్పినట్లు వినాల్సిందేనంటూ ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపుతున్నారు. అందుకు నిదర్శనంగా అమెరికాకు మిత్రదేశమైన ఆస్ట్రేలియాతో తగువు పెట్టుకున్నారు. ఒబామా హయాంలో కుదుర్చుకున్న శరణార్థుల ఒప్పందంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో వాగ్వాదానికి దిగి మధ్యలోనే ఫోన్ పెట్టేశారు. అధ్యక్షుడయ్యాక వరుసగా ప్రపంచదేశాల అధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్... ఇంతవరకూ తాను మాట్లాడిన ఫోన్ కాల్స్‌లో ఇదే అత్యంత చెత్తదిగా పేర్కొన్నారని ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. టర్న్‌బుల్‌తో దాదాపు గంట సేపు మాట్లాడాలనుకున్న ట్రంప్ 25 నిమిషాలకే ఫోన్ కాల్ ముగించారని ఆ పత్రిక వెల్లడించింది. గత శనివారం ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌కు ట్రంప్ ఫోన్ చేశారు. ఒబామాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియా శరణార్థుల్ని అమెరికాలోకి అనుమతించాలని మాల్కం కోరగా... ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం సాగినట్లు అమెరికా మీడియా పేర్కొంది. 2 వేల మంది శరణార్థుల్ని అమెరికా అంగీకరించడం చాలా చెత్త ఒప్పందమని ట్రంప్ మండిపడ్డారు. 2వేల మంది కాదని 1,250 మంది శరణార్థులేనని టర్నబుల్ పదే పదే ట్రంప్‌కు గుర్తు చేశారు. శరణార్థుల్లో ఒకరు మరో బోస్టన్ బాంబర్ అవుతారంటూ ఆరోపణలు చేశారు. అమెరికాకు శరణార్థుల రాకను తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యం లో ఒబామా సర్కారు చేసుకున్న ఒప్పందం ఎలా అమలవుతుందని ట్రంప్ ప్రశ్నించారు. ఇదొక చెత్త ఒప్పందం: ట్రంప్ అనంతరం ట్రంప్ ట్వీట్ చేస్తూ ‘ఒబామా సర్కారు వేలాది మంది శరణార్థుల్ని అక్రమంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చెత్త ఒప్పందాన్ని నేను పరిశీలిస్తాను’ అన్నారు. టర్న్‌బుల్ మాత్రం ట్రంప్‌తో సంభాషణ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. అమెరికా – ఆస్ట్రేలియాల మధ్య ఒప్పందం మేరకు పసిఫిక్ దేశాలైన నౌరు, పపువా న్యూగినియా సముద్ర తీరాల్లోని నిర్బంధ శిబిరాల్లో ఉంటున్న 1,250 మంది శరణార్థుల్ని అమెరికా అనుమతించాలి. ఈ శరణార్థుల్లో చాలామంది ఇటీవల ట్రంప్ నిషేధం విధించిన 7 దేశాలకు చెందిన వారు ఉన్నారు. మత స్వేచ్ఛకు పాటుపడతాం అమెరికాలో మత స్వేచ్ఛను కాపాడేందుకు తన సర్కారు సాధ్యమైనదంతా చేస్తుందని ట్రంప్ అన్నారు. ‘అమెరికా ఎప్పటికీ సహనానికి ప్రతీకగా ఉండాలి. భద్రంగా ఉన్నామనే భావన అందరిలో ఉండాలి’ అని పేర్కొన్నారు. మతస్వేచ్ఛకు ఉగ్రవాదం ప్రధాన ముప్పని, దాన్ని అడ్డుకోవాల్సిందేనన్నారు. ఇదిలాఉండగా, అమెరికా విదేశాంగ మంత్రిగా రెక్స్ టిల్లర్సన్ (64) ప్రమాణ స్వీకారం చేశారు. టిల్లర్సన్ నియామకాన్ని 56–43 ఓట్లతో సెనేట్ ఆమోదించింది. ఒల్తైన జుట్టు వెనుక... మీరెప్పుడైనా ట్రంప్ హెయిర్ స్టైల్‌ను క్షుణ్నంగా పరిశీలించారా... ఏడు పదుల వయసులోను జాలువారుతున్న వెంట్రుకలతో ఆకట్టుకునే కేశ సంపద ట్రంప్ సొంతం. ఈ వయసులోనూ అంత ఒత్తైన జుట్టు ఎలా సాధ్యమనే రహస్యాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు బయటపెట్టారు. పొడవైన జుట్టు కోసం ట్రంప్ ప్రొస్టేట్ సంబంధిత మందులు (ఫినాస్టెరైడ్) వాడేవారంటూ.. 1980 నుంచి వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించిన హరొల్డ్ ఎన్ బోర్నస్టెయిన్ న్యూయార్క్ టైమ్స్ పత్రికకు తెలిపారు. ఫినాస్టెరైడ్ను మగవాళ్లలో బట్టతల నివారణకు కూడా వినియోగిస్తారు. అలాగే బుగ్గలు, నుదుటి భాగంలో ఎర్రటి దద్దుర్లు (రొజెసియా) తగ్గేందుకు యాంటీ బయాటిక్స్, రక్తం లోని కొలస్ట్రాల్‌తో పాటు కొవ్వు తగ్గేందు కు స్టాటిన్ వాడేవారని ఆయన చెప్పారు. గుండెపోటు ప్రమాదం తగ్గేందుకు రోజూ ‘బేబీ ఆస్పిరిన్ ’ తీసుకునేవారని, ఆరోగ్యం విషయంలో ట్రంప్ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవారని హరొల్డ్ వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement