ఈ ఫోన్లో 2 సెల్ఫీ కెమెరాలు.. ధరెంతో తెలుసా? | Sakshi
Sakshi News home page

ఈ ఫోన్లో 2 సెల్ఫీ కెమెరాలు.. ధరెంతో తెలుసా?

Published Sat, Jan 21 2017 3:36 PM

ఈ ఫోన్లో 2 సెల్ఫీ కెమెరాలు.. ధరెంతో తెలుసా?

ఇప్పటివరకు వెనుకవైపు రెండు కెమెరాలతో వినియోగదారులను ఆకట్టుకున్న వివో కంపెనీ,  సెల్ఫీలకు పెరిగిన ఆదరణతో రెండు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాల ఫోన్ రూపొందించింది. 'వీ5 ప్లస్' పేరుతో రూపొందిన ఈ ఫోన్ను ప్రస్తుతం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు వివో రంగం సిద్దం చేసింది. జనవరి 23వ తేదీన ఈ ఫోన్ను వివో కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఫోన్ లాంచింగ్కు ముందు అందుబాటులో ఉండే ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ముంబాయికి చెందిన రిటైలర్ మహేశ్ టెలికాం పేర్కొంది. ఈ ఫోన్ ధర రూ.27,980గా ఉన్నట్టు ఈ రిటైలర్ పేర్కొంది.
 
వీ5 ప్లస్తో పాటు ప్రీఆర్డర్ చేసుకున్న వారికి వీఆర్ హెడ్సెట్ను కంపెనీ అందిస్తోంది. ఇటీవల కాలంలో సెల్ఫీలకు విపరీతంగా ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫ్రంట్ కెమెరాలపై వివో ఎక్కువగా ఫోకస్ చేసింది. రెండు ఫ్రంట్ కెమెరాలతో ఇక సెల్ఫీలను మరింత నాణ్యవంతంగా తీసుకోవచ్చు.  వివో ఫోన్లు ఇప్పటివరకు వెనుకవైపు రెండు కెమెరాలు కలిగి ఉండేవి. ఇలా ఆకట్టుకున్న వివో కంపెనీ ముందు వైపు రెండు కెమెరాలతోనూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఒక కెమెరా 20 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్, మరొకటి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. వెనుకవైపు కెమెరాలో 16 మెగాపిక్సెల్ షూటర్ను వివో వీ5 ప్లస్లో అందించనుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3160 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లోని ఫీచర్లు. 

Advertisement
Advertisement