యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

Published Fri, Sep 19 2014 12:08 PM

Man kills youth over love affair

తాను ప్రేమిస్తున్న యువతితో కలిసి తిరుగుతున్నాడన్న కోపంతో.. ఓ యువకుడిని కాల్చిచంపాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానె సమీపంలో జరిగింది. అర్జున్ అశోక్ తుషాంకర్ (18) ఓ ఇంట్లో పనిచేస్తుంటాడు. అతడు ఆ అమ్మాయితో కలిసి గుడికి వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా, నిందితుడు అతడిని అటకాయించి పాయింట్ బ్లాంక్ రేంజి నుంచి కాల్చిచంపాడు.

నగరంలోని సావర్కర్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే నిందితుడు సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. బహుశా నిందితుడు, హత్యకు గురైన యువకుడు కూడా ఒకే అమ్మాయిని ప్రేమించి ఉంటారని, దాని విషయమై గొడవ వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.

Advertisement
Advertisement