హైకోర్టు విభజనపై తేల్చండి | Sakshi
Sakshi News home page

హైకోర్టు విభజనపై తేల్చండి

Published Wed, Mar 4 2015 4:04 AM

హైకోర్టు విభజనపై తేల్చండి - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనలో జాప్యంపై టీఆర్‌ఎస్ మంగళవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంథ లో కేంద్రం చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌పై చర్చించేందుకు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలంటూ టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టగా స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతిలేదు.

ప్రత్యేక సందర్భంగా పేర్కొంటూ ఒక నిమిషం మాట్లాడేందుకు అనుమతించా రు. జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ ఏపీ విభజన చట్టం లో ఉమ్మడి హైకోర్టును విభజించాలని స్పష్టంగా ఉంది. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పీఎంని, సుప్రీం, హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల ను కూడా కలిశారు. హైకోర్టు విభజన పూర్తయ్యాకే జూనియర్ జడ్జీల నియామకాలను చేపట్టాలని కోరినా.. న్యాయస్థానాలు అంగీకరించలేదు.’ అని పేర్కొన్నారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. ‘ఈ అంశాన్ని లేవనెత్తేందుకు స్పీకర్ అసాధారణ పరిస్థితుల్లో అవకాశం ఇచ్చారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక హైకోర్టు ఉండాలన్న వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ఈ విషయాన్ని న్యాయమంత్రి పరిశీలిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. మరో ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ ‘హైకోర్టు విభజనపై మంత్రి సదానందగౌడ నాకు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం నుంచిగానీ, ఉమ్మడి హైకోర్టు నుంచిగానీ ప్రతిపాదనకు జవాబు రాలేదని పేర్కొన్నారు.’ అని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement