ఎలాంటి తప్పుచేయలేదు | Sakshi
Sakshi News home page

ఎలాంటి తప్పుచేయలేదు

Published Thu, Apr 23 2015 2:50 AM

tbgks president and secretaries arrested

రుద్రంపూర్ : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాజిరెడ్డి వర్గం ఎటువంటి ఫ్రాడ్ చేయలేదని, కార్మికుల నుండి చందా రూపంలో వచ్చిన ప్రతిరూపాయికి లెక్క ఉందని, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుగుల వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ 8 మెన్ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం టీబీజీకేఎస్ కార్పొరేట్  కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యూనియన్ ఎదుగుదలను ఓర్వలేక కొందరు  కుట్రపన్ని దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు.

ట్రేడ్ యూనియన్ చట్టం 1926,47 ప్రకారం ఖర్చుపెట్టిన వాటికి సంబంధించిన లెక్కలు తీర్మానం చేసి ఉంచామని, కోర్టు కావాలని అడినప్పుడు తమ నిజాయితీని చూపించుకుంటామని తెలిపారు. ప్రధానంగా యూనియన్ డబ్బులు రూ. 90 లక్షలల్లో సుమారు రూ. 36 లక్షలు ఖర్చుపెట్టి రెండు వాహనాలు ఖరీదు చేశామని, మిగతా డబ్బులు బ్యాంక్‌లో ఉన్నాయన్నారు. వీటిలో కొంత 11 ఏరియాలలోని యూనియన్ కార్యాలయ ఖర్చుల కోసం, మరికొంత  యూనియన్ అభివృద్ధి పనుల కోసం ఉంచామే తప్ప మర్మమేమీ లేదన్నారు.

దీనికి సంబంధించిన అకౌంట్‌లు ఉన్నాయన్నారు. ఈ కుట్రకు సింగరేణి మాజీ డెరైక్టర్ పా తెరవెనుక ఉండి నాటకం సాగించారని ఆరోపించారు. నిజాయితీ గల తమ నాయకులు తప్పకుండా విడుదల అవుతారని పేర్కొన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ కొమరయ్య, సంఘం చందర్, ఆర్జీ-3 వైస్ ప్రెసిడెంట్ యం రఘువీర రెడ్డి, జనార్దన్ రెడ్డి, కె వెంకటేశ్వరరావు, సెంట్రల్ కమిటీ సభ్యులు కాపు కష్ణ, పద్మారావు, డప్పుకుమార్, బొట్ల స్వామి, పొదిల శ్రీనివాస్, కోల ఎల్లయ్య, వి .కష్ణప్రసాద్, యం రమేష్;రాజ్‌కుమార్,మధుర దాస్,మామిడి కనకరాజు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement