స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. వ్యాధి తీవ్రతను అరికట్టి గాడిలో పెట్టాలనుకున్న యంత్రాంగం ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మంగళవారం స్వైన్‌ఫ్లూ ప్రభావంతో జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఘట్కేసర్ మండలం నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏదులాబాద్కు చెందిన శైలజ, సరూర్‌నగర్ పీహెచ్సీ పరిధిలోని చంపాపేటకు చెందిన బ్రహ్మనాయుడు మంగళవారం గాంధీ ఆస్పత్రిలో మృతి చెం దారు. ఇదే రోజు మరో తొమ్మిది మందికి వ్యాధి సోకినట్లు నివేదికలు రావడం అటు జిల్లా యంత్రాంగాన్ని, ఇటు సామాన్య ప్రజానికాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
ఇప్పటివరకు 112 మందికి..
జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. రాజధాని చుట్టూ విస్తరించి ఉన్న నేపథ్యంలో జిల్లా నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య సైతం ఎక్కువ. ఇదే వ్యాప్తికి దోహదం చేస్తోందని అధికారులు చెబుతున్నారు. నగర శివారు మండలాల్లోనే వ్యాధి వ్యాప్తి ఎక్కువున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు సైతం చెబుతున్నాయి. జనవరి నెలలో ఇప్పటివరకు జిల్లాలో 112 మందికి ఈ వ్యాధి సోకినట్లు వైద్య శాఖ నిర్దారించింది. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నా.. మెజార్టీ బాధితుల పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
నలుగురు చిన్నారులకూ స్వైన్‌ఫ్లూ..
చిన్నా, పెద్దా తేడా లేకుండా స్వైన్‌ఫ్లూ వ్యాప్తిచెందుతోంది. మంగళవారం జిల్లాలో తొమ్మిది కేసులు నమోదు కాగా.. ఇందులో ఒకరు ఆరు నెలల చిన్నారి కాగా, మరొకరు ఏడు నెలల బాలుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడకు చెందిన ఆరు నెలల చిన్నారి, ఘట్కేసర్ మండలం నారపల్లికి చెందిన ఏడు నెలల బాలుడు నగరంలోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులు నగరంలోని లోటస్, రెయిన్బో ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. మిగతా ఐదుగురు నలభైఏళ్లకు పైబడినవారే.
మందులతో మమ అనిపిస్తూ..
జిల్లాలో ప్రజారోగ్యం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం మందులు అందుబాటులో పెట్టామంటూ చేతులు దులిపేసుకుంటుంది. వ్యాధిపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. జిల్లా వైద్య శాఖ మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు స్వైన్‌ఫ్లూ మాత్రలు పంపించాల్సి ఉండగా.. అధికారులు మాత్రం ఆ మందులను ప్రాంతీయ ఆస్పత్రులకే పరిమితం చేశారు. కొండాపూర్ ప్రాంతీయ ఆస్పత్రిలో 500 క్యాప్సుల్స్, 5 బాటిళ్ల సిరప్ అందుబాటులో ఉంచారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో 100 క్యాప్సుల్స్, 5 బాటిళ్ల సిరప్, వనస్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రిలో 100 క్యాప్సుల్స్, 10 బాటిళ్ల సిరప్ అందుబాటులో ఉంచారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో 690 క్యాప్సుల్స్, 35 బాటిళ్ల సిరప్ నిల్వ చేశారు.
స్వైన్ కేసులు@ 112
Published Wed, Jan 28 2015 9:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement