గర్భిణీ అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

గర్భిణీ అనుమానాస్పద మృతి

Published Tue, Sep 1 2015 3:23 PM

pregnant suspicious death

ముదిగొండ (ఖమ్మం) : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని మేడిపల్లిలో చెరుకు. యల్లమ్మ(30)కు, వీరబాబుకు ఏడాది కిందట వివాహమైంది.

అయితే ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. కాగా మంగళవారం భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె మృతి చెంది ఉంది. భర్తే  ఆమెను హతమార్చాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement