వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
మంకమ్మతోట/బోయినపల్లి: కరీంనగర్‌లోని మిడ్‌మానేర్‌కు గండిపడి.. వరద ప్రవాహం తో ఇసుక మేటలు పడిన పంట భూములకు ఎకరానికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మిడ్‌మానేర్ ప్రాజెక్టును సంద ర్శించి పంటలు కోల్పోయిన బాధితులను పరామర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు. అలాగే, బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద గండిపడ్డ మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్టను పరిశీలించారు. మాన్వాడ వద్ద పంట నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ.. నష్టపరిహారం అందేవరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మిడ్‌మానేర్ ప్రాజెక్టు ముంపుకు గురై పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే 12 ముంపు గ్రామాల నిర్వాసితులకు పూర్తి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కట్ట తెగడం వెనుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం కనబడుతున్నా యన్నారు. స్పిల్‌వే కన్నా ఎత్తులో మట్టి కట్ట నిర్మించాల్సి ఉండగా, తక్కువ ఎత్తులో నిర్మిం చడం తోనే నీటి ఉధృతికి కట్ట తెగిందన్నారు.
మిడ్‌మానేర్‌ను సందర్శించిన వారిలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, మతీన్ ముజారుద్దీన్, బోయినపల్లి శ్రీనివాసరావు, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జిల్లాల అధ్యక్షులు అక్కెనపెల్లి కుమార్, బమ్మిడి శ్రీనివాసరెడ్డి, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, నాడెం శాంతకుమార్, అమృతసాగర్, వెల్లాల రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
మిడ్‌మానేరుకు గండిపై దర్యాప్తు జరపాలి
Published Fri, Sep 30 2016 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement