ఆర్టీసీని లాభాల్లోకి తేవాలి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని లాభాల్లోకి తేవాలి

Published Wed, Aug 27 2014 4:14 AM

ఆర్టీసీని లాభాల్లోకి తేవాలి

హన్మకొండ సిటీ :  ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించాలని వరంగల్ రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి డిపో మేనేజర్లకు సూచిం చారు. హన్మకొండలోని వరంగల్ రీజినల్ కార్యాలయం లో మంగళవారం డిపో మేనేజర్ల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిపోల వారీగా ప్రగతిని సమీక్షించారు. అనంతరం ఆర్‌ఎం మాట్లాడుతూ రీజియన్‌లో వరంగల్-1, హన్మకొండ డిపోలు లాభాల్లో ఉన్నాయని తెలిపారు. వరంగల్-2, పరకాల, భూపాలపల్లి, నర్సం పేట, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు డిపోలు న ష్టాల్లో ఉన్నాయన్నారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు రీజియన్ రూ.1.84 కోట్ల నష్టాల్లో ఉందని వివరించారు.
 
ఆర్టీసీని లాభాల్లోకి తేవడానికి బస్సుల వారీగా ఆదాయాన్ని సమకూర్చాలని డిపో మేనేజర్లకు సూచించారు.  గరుడ, ఇంద్ర బస్సుల ఆదాయం మెరుగ్గా ఉందన్నారు. అదేవిధంగా సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల పరిస్థితి ఆశాజనకంగా, డీలక్స్ బస్సుల పరిస్థితి నిరాశజనకంగా ఉందని పేర్కొన్నారు. సబర్బన్ బస్సుల ఆదాయం తగ్గిందని వివరించారు. వీటి ఆదాయం పెం చేందుకు ప్రధాన స్టేజీల వద్ద ట్రాఫిక్ గైడ్‌లను నియమిస్తున్నట్లు చెప్పారు. జూలైలో వరంగల్ రీజియన్ ఇంధన పొదుపులో అగ్రభాగంలో ఉందన్నారు. సమయ పాలనలో మహబూబాబాద్, భూపాలపల్లి డిపోలు వెనుకబడి ఉన్నాయని వివరించారు. డిప్యూటీ సీటీఎం భవానీప్రసాద్, డిప్యూటీ సీఎంఈ అంచూరి శ్రీధర్, ఏఓ వై.కృష్ణ, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.
 
ఇంధనాన్ని పొదుపు చేయూలి..
ఇంధన పొదుపుతో పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని ఆర్టీసీ ఆర్‌ఎం ఇ.యాదగిరి డ్రైవర్లకు సూచించారు. వరంగల్‌లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ శిక్షణ కాలేజీలో ఆర్టీసీ డ్రైవర్లకు ఇంధన పొదుపు పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు సాధారణ ఇంజిన్ శక్తిని ఉపయోగించి వాహనాన్ని నడపడంతో కేఎంపీఎల్ తక్కువగా వస్తుందన్నారు. పవర్‌పాయింట్‌ను ఉపయోగించి సరైన దిశలో ఎక్స్‌లెటర్ వాడితే డీజిల్ తక్కువ ఖర్చయి అత్యధిక కేఎంపీఎల్ వస్తుందన్నారు. డీజిల్ ఎంత ఎక్కువ ఖర్చయితే అంత కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ అంచూరి శ్రీధర్, రాజు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement