నకిలీ నోట్లతో సామాన్యులు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. కష్టపడి సంపాదించిన డబ్బుల్లో నకిలీ నోట్లు ఉన్నాయని తెలిస్తే ఆందోళన తప్పదు. రిజర్వ్‌బ్యాంక్ 2011 లెక్కల ప్రకారం మన దగ్గర 64,577 మిలియన్ నోట్లను దొంగనోట్లుగా గుర్తించారు. మరి డబ్బులు తీసుకునే ముందు అవి నకిలీవా లేక అసలైనవా? తెలుసుకోవడం తప్పనిసరి. వాటిని ఎలా గుర్తించాలి. ఏ నోటును ఎలా పరీక్షించాలనే వివరాలు మీ కోసం...
రూ.వెయ్యి, 500, 100, 50, 20ను గుర్తించాలంటే
ఈ 10 అంశాలను పరిశీలించాలి
1. ఎడమవైపున మధ్యలో 1000 సంఖ్యలో ప్రతి అక్షరం సగం కనిపించి సగం కనపడకుండా ఉంటుంది. వెలుతురులో చూస్తే పూర్తిగా కనిపిస్తుంది. నోటును తిరగేసి చూస్తే రివర్స్‌లో సంఖ్య కనిపిస్తుంది.
2. దాని పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో గాంధీజీ ఫొటో వాటర్ మార్క్‌తో కనిపిస్తుంది. వాటర్ మార్క్‌కు పక్కన 1000 సంఖ్య నిలువుగా ఉంటుంది. దీన్ని కూడా వెలుతురుకు పెట్టి చూడాలి.
3. నోటును పైకీ కిందకు అంటుంటే మధ్యలో ఉన్న 1000 అక్షరాల రంగు మారుతుంది. గ్రీన్, బ్లూగా కనిపిస్తుంది.
4. కుడి వైపున పైన, ఎడమ వైపు కింద ఉన్న సిరీస్ నంబరు వెలుతురులో చూస్తే ప్రత్యేకంగా కనిపిస్తుంది.
5. మధ్యలో ఉన్న థ్రెడ్(దారం)పై భారత్, ఆర్బిఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి. నోట్‌ను పైకీకిందకు అంటుంటే మధ్యలో థ్రెడ్ బ్లూ, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది.
6. దానికిందే ఉన్న హిందీ అక్షరాలు, అలానే పైన నోటుకు మధ్యలో ఉన్న హిందీ, ఇంగ్లిష్ అక్షరాలు ముట్టుకుంటే చేతికి తగిలిన భావన కలుగుతుంది.
7. నోటుకు కుడి వైపున చివరన 1000 సంఖ్యకు, రిజర్వ్ బ్యాంక్ ముద్రకు మధ్యలో లెటెంట్ ఇమేజ్. దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తేనే కనిపిస్తుంది. నోటును దగ్గరగా పెట్టుకుని చూస్తేనేఇది కనిపిస్తుంది.
8. ఇమేజ్ ఎడమ వైపున, గాంధీజీ ఫొటోకు మధ్యలో ఉన్న ఖాళీలో సూక్ష్మ పరిశీలన చేస్తే ఆర్బిఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి.
9. ఎడమ వైపు చివర మధ్యలో డైమండ్ ఆకారంలో గుర్తు ఉంటుంది. దీన్ని చేతితో తడుముతుంటే ముట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది.
10. నోటు వెనుక వైపు మధ్యలో సంవత్సరం ముద్రించి ఉంటుంది.
రూ.10 నోట్ ఈ విధంగా...
రూ. పది నోటుకు ఏడు అంశాలు పరిశీలించాలి. పైన పేర్కొన్న వాటిలో స్పెషల్ ఐడెంటిఫికేషన్ మార్క్, లెటెంట్ ఇమేజ్ ఉండదు. అక్షరాలు చేతితో తడిమితే ఎలాంటి భావన కలగవు. మిగిలినవన్నీ యథాతథం
గమనిక: ప్రతి నోటుకు ఎడమ వైపు చివర మధ్యలో గుర్తులు మారుతుంటాయి. రూ.1000కి డైమండ్, రూ.500కు రౌండ్ చుక్క, రూ.వందకు త్రిభుజం, రూ.50కి బ్లాక్ గుర్తు, రూ. 20కి రెక్టాంగిల్ గుర్తు ఉంటుంది. రూ.10 నోటుకు ఎలాంటి గుర్తు ఉండదు.
నకిలీ నోట్లను గుర్తించండిలా...
Published Sat, Nov 1 2014 1:38 AM
Advertisement
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement