ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతు ఆత్మహత్యలు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతు ఆత్మహత్యలు

Published Tue, Oct 21 2014 2:29 AM

farmer suicides with government negligence

ఆదిలాబాద్ రిమ్స్ : ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్య ఆరోపించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బీజేపీ జిల్లా సమావేశాన్ని ఏర్పా టు చేశారు. భూమయ్య మాట్లాడుతూ, అప్పుల బా ధతో, పంటలు ఎండిపోయి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 55 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు అందించాల్సిన రుణాలు, పంట నష్ట పరిహారం చెల్లించడంలో పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపకోవడంతో రైతులు ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం విధిస్తున్న కరెంట్ కోతలతో పంటలకు నీరందించుకునే పరిస్థి తి లేకుండా పోయిందని వివరించారు. కరెంట్ కోతలతో పారిశ్రామిక రంగ అభివృద్ధి సైతం నిలిచిపోయిందని తెలిపారు. ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటూనే ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. దీనికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాధర్నాకు ముషీరాబాద్ ఎమ్మెల్యే రాంచందర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎ త్తున రైతులు, కార్యకర్తలు తరలివచ్చి ధర్నాను విజ యవంతం చేయాలని కోరారు. బీజేపీ నాయకులు పాయల శంకర్, సురేశ్‌జోషి, జోగురవి, జనగం సం తోష్, విజయ్‌కుమార్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement