కేసీఆర్‌కు ఓటమి భయం | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ఓటమి భయం

Published Mon, Nov 26 2018 10:50 AM

Congress Candidate Bhudida Bhikshm Canvass In Nalgonda - Sakshi

సాక్షి, ఆలేరు : సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఇక ఫాంహౌస్‌కే పరిమితం కావాలని ఆలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌ విమర్శించారు. మండలంలోని రాఘవాపురం, గుండ్లగూడెం, శ్రీనివాసపురం, కందిగడ్డతండా, శివలాల్‌తండా, కొల్లూరు తదితర గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మాటతప్పిన కేసీఆర్‌ను ఓడించి  బుద్ధి చెప్పాలన్నారు. యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేక, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతులతో పాటు సామాన్యుడి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. అలాగే మిషన్‌భగీరథ, సాగునీటి ప్రాజెక్టులలో దోచుకున్న అవినీతి సొమ్ముతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ను గద్దె దించాలని కోరారు.  నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శాశ్వత ప్రాతిపాదికన చేపట్టేందుకు తనను గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ మేని ఫెస్టోను రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో భిక్షమయ్యకు స్వాగతం పలికారు. కందిగడ్డతండాలో పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జనగాం ఉపేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నీలం పద్మ,  దూసరి విజయ, దూసరి ఆంజనేయులు, పుట్ట మల్లేషం, సందుల సురేశ్, ముదిగొండ శ్రీకాంత్, జూకంటి ఉప్పలయ్య, జంపాల దశరథ, శ్రీను, హరిలాల్, కృష్ణ, రవి, మోతిలాల్, వెంకటేశ్, ప్రేం రాజు, భీంరాజు, రాజు, లక్ష్మీ, విజయ, అనిత, శాంతి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement