సర్కార్‌ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది | Sakshi
Sakshi News home page

సర్కార్‌ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది

Published Sat, Jul 8 2017 11:47 AM

bjp leader fired on cm kcr

కరీంనగర్: తెలంగాణ సర్కార్‌ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్‌.ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదన్నారు. శనివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, మండల వ్యవస్థని బ్లాక్‌లుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు.

నిధులు, విధుల విషయంలో స్పష్టత లేకుండా కేవలం పేరు మారిస్తే సరిపోదని, డ్రగ్స్, కల్తీ దందా నిరోదించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. డ్రగ్స్ దందాలో గతంలో ఎన్ని కేసులు నమోదు చేశారో, ఎన్ని చార్జీషీట్లు వేశారో  శ్వేతపత్రం విడుదల చేయాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్‌ చేశారు. విజిలెన్స్ సెల్‌కి వెంటనే పూర్తి స్థాయి అధికారిని నియమించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement