కరడుగట్టిన నేరస్థుడు దొరికాడు | Sakshi
Sakshi News home page

కరడుగట్టిన నేరస్థుడు దొరికాడు

Published Fri, May 22 2015 7:33 PM

big criminal erukala srinivas arest

హైదరాబాద్: కరడుగట్టిన నేరస్థుడు ఎరుకల శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై ఇప్పటికే ఏడు అత్యాచారాల కేసులు, ఏడు హత్య కేసులు, దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. గతంలో చేసిన నేరాలకే శ్రీనివాస్ ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. అయితే, బయటకు వచ్చిన తర్వాత కూడా అతడు తన నేర ప్రవృత్తిని మానుకోకుండా భయోత్పాతం సృష్టిస్తూనే ఉన్నాడు.

ముఖ్యంగా, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో మహిళలనే లక్ష్యంగా చేసుకొని శ్రీనివాస్ దాడులకు పాల్పడటం, లైంగిక దాడులు చేయడం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి పోలీసులకు శ్రీనివాస్ను పట్టుకోవడం సవాలుగా మారి చివరకు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement