చెరువుల పునరుద్ధరణలో వ్యవసాయశాఖ కీలకం | Sakshi
Sakshi News home page

చెరువుల పునరుద్ధరణలో వ్యవసాయశాఖ కీలకం

Published Sat, Feb 28 2015 2:20 AM

చెరువుల పునరుద్ధరణలో వ్యవసాయశాఖ కీలకం - Sakshi

- నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణలో సాగునీటి శాఖతోపాటు వ్యవసాయశాఖ సేవలు కీలకమని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. పూడికమట్టిని రైతులు పొలాలకు తరలించడంలో వ్యవసాయశాఖ పాత్ర ముఖ్యమైనదన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, అటవీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మిషన్ కాకతీయను విజయవంతం చేస్తామన్నారు. దీనికోసం విశ్రాంత వ్యవసాయ అధికారుల సేవలను విని యోగించుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో వ్యవసాయ అధికారులు, విశ్రాంత అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మిషన్ కాకతీయపై అవగాహన సదస్సులో హరీశ్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ లో ఇప్పటికే 6వేల చెరువులకు పరిపాలనా అనుమతులు పూర్తయ్యాయని చెప్పారు.

ఎన్నికల కోడ్  దృష్ట్యా పనులు ఆగిపోయాయని, అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే ప్రారంభిస్తామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌లో తన సందేశాన్ని చెబుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా రానున్న బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిధులపై అధికారులతో మంత్రి టి.హరీశ్‌రా వు శుక్రవారం అసెంబ్లీ సమావేశమందిరంలో సమీక్షించారు.
 
కన్నీరు పెట్టిన ‘తన్నీరు’
మిషన్ కాకతీయపై అవగాహన సదస్సులో  విశ్రాంత వ్యవసాయ శాఖ అధికారి సత్యనారాయణ రైతుకష్టాలపై ‘నేను బతికే ఉన్నా’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. రాములు అనే రైతు ఎక్కడా అప్పు పుట్టక, తెగులు బారిన పడిన పంటలను కాపాడుకోలేక ఆత్మహత్యకు పాల్పడతాడు. దీంతో భార్య, ఆరేళ్ల కూతురు, ఆత్మహత్య చేసుకున్న రాములు మృతదేహం వద్ద అత్యంత దీనస్థితిలో రోది స్తారు. ఈ సన్నివేశాన్ని చూసి చలించిన మం త్రి తన్నీరు హరీశ్‌రావు కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ రైతుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావద్ద నే తమ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీరు, కరెంట్‌లపై ప్రధానంగా శ్రద్ధ పెట్టిందన్నారు.

 

Advertisement
Advertisement