సింగరేణికి షాకిచ్చిన కేఓసీ నిర్వాసితులు | Sakshi
Sakshi News home page

సింగరేణికి షాకిచ్చిన కేఓసీ నిర్వాసితులు

Published Mon, Jan 23 2017 1:20 PM

​high court stay on koyagudem opencast

టేకులపల్లి: కోయగూడెం ఓపెన్‌ కాస్టు(కేఓసీ) పిట్‌-1 పరిధిలోని ధారపాడు నిర్వాసితులు సింగరేణి కంపెనీకి షాక్‌ ఇచ్చారు. నిర్వాసితుల రిట్‌ దాఖలుతో హైకోర్టు కేఓసీ పిట్‌-1పై స్టే ఇచ్చింది. ముందస్తు భూసేకరణతో తమకు అన్యాయం జరిగిందని, జీవో 34 కానీ, 2013 చట‍్టం ప్రకారం కానీ పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు.
 
అయితే సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండు నెలల క్రితం 55 మంది నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టేకులపల్లిలో సోమవారం విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ లక్కినేని సురేందర్‌, ఎంపీటీసీ జబ్బ విజయలక్ష్మి, సర్పంచ్‌ పూనెం సురేందర్‌ నిర్వాసితులతో కలిసి వివరాలు వెల్లడించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement