వెయిట్‌లిఫ్టింగ్‌లో 4 రికార్డులు | Sakshi
Sakshi News home page

వెయిట్‌లిఫ్టింగ్‌లో 4 రికార్డులు

Published Mon, Sep 22 2014 1:00 AM

వెయిట్‌లిఫ్టింగ్‌లో 4 రికార్డులు

ఇంచియాన్: ఆసియా క్రీడల్లో వరుసగా రెండోరోజు కొత్త ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఆదివారం జరిగిన పురుషుల 62 కేజీల విభాగంలో కిమ్ ఉన్ గుక్ (ఉత్తర కొరియా) రెండు... మహిళల 53 కేజీల విభాగంలో సు షుచింగ్ (చైనీస్ తైపీ), జుల్ఫియా చిన్‌షాన్లో (కజకిస్థాన్) వేర్వేరు అంశాల్లో ఒక్కో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కిమ్ ఉన్ గుక్ స్నాచ్‌లో 154 కేజీలు ఎత్తి 2002 నుంచి చైనా లిఫ్టర్ షి జియాంగ్ (153 కేజీలు-2002లో) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా 332 కేజీలతో స్వర్ణం నెగ్గడంతోపాటు ఈ అంశంలో 328 కేజీలతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు. మరోవైపు సు షుచింగ్ మొత్తం 233 కేజీలు (స్నాచ్‌లో 101+ క్లీన్ అండ్ జెర్క్‌లో 132) బరువెత్తి ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణం దక్కించుకుంది. షుచింగ్ ప్రదర్శనతో లీ పింగ్ (చైనా-229 కేజీలు) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో జుల్ఫియా 132 కేజీలు బరువెత్తి... 131 కేజీలతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాసింది. జుల్ఫియా తర్వాత షుచింగ్ కూడా 132 కేజీల బరువెత్తింది. ఈ బరువును జుల్ఫియా తొలుత ఎత్తడంతో ప్రపంచ రికార్డు ఆమె పేరిటే ఉంది.



 

Advertisement
Advertisement