సివిల్స్‌ మార్కులు.. ఫస్ట్‌ ర్యాంకర్‌కు 55.60 శాతమే! | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 8:10 PM

UPSC Releases Civil Services 2017 Marks - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తాజా సివిల్స్‌ ర్యాంకర్ల మార్కుల వివరాలను యూపీఎస్సీ ఆదివారం  విడుదల చేసింది. 2017 సివిల్స్‌ ఫైనల్‌ ఫలితాలను గత నెల 27న ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో దూరిశెట్టి అనుదీప్‌ మొదటి ర్యాంకు సాధించారు. అతని మార్కుల శాతం 55.60. మొత్తం 2025 మార్కులకు అనుదీప్‌ 1126 మార్కులు సాధించారు. అందులో 950 రాత పరీక్షలో వస్తే, 176 మార్కులు ఇంటర్వ్యూలో వచ్చాయి. రాత పరీక్షకు 1750 మార్కులు కాగా.. ఇంటర్వ్యూకు 275 మార్కులకు ఉంటాయి. రెండో ర్యాంకర్‌ అను కుమారి 55.50 శాతం మార్కులు సాధించారు. ఆమె మొత్తం​ 1124 మార్కులు సాధించారు. ఆమెకు మొదటి ర్యాంకర్‌ అనుదీప్‌కు కేవలం రెండు మార్కులే తేడా. మూడో ర్యాంకర్‌ సచిన్‌ గుప్తా 55.40 శాతం మార్కులు సాధించారు. ఇతరుల మార్కులు, శాతాల కోసం యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో చూడోచ్చు upsconline.nic.in. 

Advertisement
 
Advertisement
 
Advertisement