నీట్‌ పీజీ అర్హత మార్కులు తగ్గించండి | Sakshi
Sakshi News home page

నీట్‌ పీజీ అర్హత మార్కులు తగ్గించండి

Published Tue, Feb 21 2017 1:39 AM

నీట్‌ పీజీ అర్హత మార్కులు తగ్గించండి - Sakshi

కేంద్ర మంత్రి నడ్డాకు రాష్ట్ర మంత్రి కామినేని విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) పీజీ వైద్య విద్యార్థుల అర్హత మార్కులను తగ్గించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రితో కామినేని సమావేశమయ్యారు. దీనిపై మంత్రి కామినేని మీడియాతో మాట్లాడుతూ.. అర్హత మార్కుల తగ్గింపు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రాథమికంగా అంగీకరించారని తెలిపారు.

అయితే ఎంత శాతం మార్కులు తగ్గిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని నడ్డా చెప్పారని వివరించారు. అలాగే రాయలసీమ ప్రాంత విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు తిరుపతిలో నీట్‌ పీజీ వైద్య పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement