పాక్కు భయపడి దీపావళి వేడుకలకు దూరం | Sakshi
Sakshi News home page

పాక్కు భయపడి దీపావళి వేడుకలకు దూరం

Published Thu, Oct 23 2014 2:32 PM

No Diwali in 50 Kashmir villages

జమ్మూ: జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు గ్రామాల్లో దీపావళి పండగను జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. 50పైగా గ్రామాల ప్రజలు దీపావళి వేడుకలకు దూరంగా ఉంటున్నారు. పాకిస్థాన్ సైనికులు ఇటీవల కాల్పులకు పాల్పడుతుండటమే దీనికి కారణం.

దీపాల వెలుగులు పాక్ దళాలకు లక్ష్యంగా మారుతాయని, తమ గ్రామాలపై దాడుల చేస్తారని సరిహద్దున గ్రామాల ప్రజలు వాపోయారు. భారత అధికారులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జమ్మూ, సాంబా, కత్వా జిల్లాల్లోని సరిహద్దు గ్రామ ప్రజలు బాణాసంచాకూడా కాల్చడం లేదు. భారత్, పాక్ దళాలు కాల్పులకు దిగడంతో సరిహద్దు వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.

Advertisement
Advertisement