ఒవైసీ ప్రశ్నకు కిరణ్ రిజ్జు సమాధానం | Sakshi
Sakshi News home page

ఒవైసీ ప్రశ్నకు కిరణ్ రిజ్జు సమాధానం

Published Tue, Apr 28 2015 8:05 PM

అసదుద్దీన్ ఒవైసీ - Sakshi

 న్యూఢిల్లీ:   విచారణ ఖైదీల ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ జరిపిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు చెప్పారు.  తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు మంత్రి కిరణ్ రిజ్జు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఐదుగురు విచారణ ఖైదీలను కోర్టుకు తీసుకెళ్తుండగా ఎస్కార్ట్ పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపారని తెలిపారు.  పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపగా ఐదుగురు ఖైదీలు చనిపోయారని తెలంగాణ డీజీపీ సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు.

ఎదురుకాల్పుల ఘటనపై ఆలేరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. ఖైదీలు 10కి పైగా కేసుల్లో నిందితులుగా ఉన్నారని వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది.  ఆ ప్రక్రియలోభాగంగా తెలంగాణ ప్రభుత్వం నివేదికను జాతీయ మానవహక్కుల కమిషన్‌కు అందచేయాల్సి ఉంటుందని మంత్రి కిరణ్ రిజ్జు బదులిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement