'ప్రత్యేక గ్రాంట్గా రూ.30వేల కోట్లు ఇవ్వండి' | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక గ్రాంట్గా రూ.30వేల కోట్లు ఇవ్వండి'

Published Fri, Feb 12 2016 2:41 PM

'ప్రత్యేక గ్రాంట్గా రూ.30వేల కోట్లు ఇవ్వండి' - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కేసీఆర్ చర్చించారు.

రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్గా 30వేల కోట్ల రూపాయల సాయం చేయాలని ప్రధానికి విన్నవించారు. 12 అంశాలతో కూడిన లేఖను ప్రధానికి అందజేశారు. సాధారణ, రైల్వే బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కేసీఆర్ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ విన్నవించారు. హైకోర్టును తక్షణమే విభజించి, తెలంగాణకు మరో 30 మంది ఐపీఎస్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ ట్రైబల్ యూనివర్సిటీకి సెంట్రల్ వర్సిటీ హోదా ఇవ్వాలని, టాటా ఇన్స్టిట్యూట్కు అనుమతులు ఇవ్వాలని, ఎయిమ్స్ను తక్షణమే ప్రారంభించాలని కేసీఆర్ కోరారు. వార్షిక రుణపరిమితికి అదనంగా 0.5 శాతం పెంచాలని ప్రధానికి విన్నవించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement