అమెరికాతో భారత్ భారీ ఒప్పందం | Sakshi
Sakshi News home page

అమెరికాతో భారత్ భారీ ఒప్పందం

Published Thu, Jul 28 2016 1:35 PM

అమెరికాతో భారత్ భారీ ఒప్పందం

న్యూఢిల్లీ: నాలుగు నిఘా విమానాల కొనుగోలు కోసం అమెరికాతో భారత్ బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6,700 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాలు ‘పోసిడాన్-8ఐ’(పీ-8ఐ)లను కొనేందుకు అమెరికా రక్షణ శాఖ, విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో దీన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే ఎనిమిది పీ-8ఐలను భారత్ కొన్నదని.  ఇప్పుడు మరో నాల్గింటిని కొంటోందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

మరో 145 తేలికపాటి ‘ఎం777’ శతఘ్నులను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది 22 ఆపాచి, 15 చినూక్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం 3 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రక్షణ రంగానికి సంబంధించి తాజా ఒప్పందంతో కలిపి గత పదేళ్లలో మొత్తం 15 బిలియన్ డాలర్ల ఒప్పందాలను అమెరికాతో భారత్ కుదుర్చుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement