‘నిజమే.. మోదీ గాడిదలాగే పనిచేస్తారు’ | Sakshi
Sakshi News home page

‘నిజమే.. మోదీ గాడిదలాగే పనిచేస్తారు’

Published Fri, Feb 24 2017 1:11 PM

‘నిజమే.. మోదీ గాడిదలాగే పనిచేస్తారు’ - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ పెట్టిన గాడిద పంచాయితీ ముందుకెళుతూనే ఉంది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ ఘాటుగా స్పందించారు. ‘గాడిదలా పనిచేస్తానని ప్రధాని మోదీ చెప్పారు. నేను ప్రధాని మాటలతో ఏకీభవిస్తున్నాను. నిజమే ఆయన గాడిదలాగే పనిచేస్తారు’ అంటూ దిగ్విజయ్‌ వ్యాఖ్యానించారు.

గుజరాత్‌ గాడిదలకు ప్రచారం చేయొద్దంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీని పరోక్షంగా విమర్శిస్తూ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు సూచించారు. ఈ మాటల తర్వాత గుజరాత్‌ బీజేపీ అఖిలేశ్‌పై తిరుగుబాటు చేయగా.. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం అఖిలేశ్‌ వ్యాఖ్యలను అంగీకరిస్తూ తనకు గాడిదలంటే ఇష్టమని, అవి ఎంతో విశ్వాసంగా పనిచేస్తాయని, తాను కూడా గాడిదలాగే పనిచేస్తానని చెప్పారు. దీనికి వ్యంగ్యంగా తాజాగా దిగ్విజయ్‌ కామెంట్లు చేశారు.

Advertisement
Advertisement