‘సీబీఐ చీఫ్‌’ కమిటీలో జస్టిస్‌ సిక్రీ | Sakshi
Sakshi News home page

‘సీబీఐ చీఫ్‌’ కమిటీలో జస్టిస్‌ సిక్రీ

Published Thu, Jan 10 2019 4:34 AM

CJI Gogoi nominates Justice A K Sikri to be part of the CBI selection panel - Sakshi

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను ఆ స్థానంలో కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునే అత్యున్నత స్థాయి కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తప్పుకున్నారు. తన స్థానంలో సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీని ప్రతిపాదించారు. ఆలోక్‌ వర్మ కేసులో తీర్పును వెలువరించే బెంచ్‌లో సీజేఐ కూడా భాగమై ఉన్న కారణంగా కమిటీ నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నేతృత్వంలోని ఈ అత్యున్నత కమిటీ ఆలోక్‌పై నిర్ణయం తీసుకోనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement